ఇటీవ‌లే వైకాపా 13వ ఆవిర్భావ దినోత్స‌వం జ‌రిగింది. పార్టీ ఎదురులేని మెజారిటీతో పొందిన అధికారం చేతిలో ఉన్నా పార్టీ ఆవిర్భావ దినోత్స‌వంలో కేడ‌ర్, లీడ‌ర్ల‌కు ఉత్సాహంగా పాల్గొన‌లేదు. వైకాపా ఆవిర్భావ‌ దినం చేశారా? అన్న‌ట్టు ఉంది. 12 ఏళ్ల‌లో ఎప్పుడూ లేనంత చప్పగా సాగింది. వైసీపీ అధిష్టానంపై సొంత పార్టీ శ్రేణులకు కూడా నమ్మకం పోయిందా? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. 2009లో త‌న తండ్రి అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడే పావురాలగుట్ట‌పై జ‌రిగిన హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో చ‌నిపోయారు. అయితే త‌న తండ్రి సీఎం ప‌ద‌విని త‌న‌కే ఇవ్వాల‌ని కాంగ్రెస్ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేశారు. వారు దిగిరాక‌పోవ‌డంతో వేరుకుంప‌టి పెట్టుకున్నారు. తెలంగాణ‌కి చెందిన శివ‌కుమార్ పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కొనుగోలు చేసి సొంతం చేసుకున్నారు జ‌గ‌న్ రెడ్డి. పార్టీ పెట్టిన ఇన్నేళ్ల‌లో ఏ ఏడాది జ‌ర‌గ‌నంత నిరాశ‌గా వైకాపా ఆవిర్భావ దినోత్స‌వం జ‌ర‌గ‌డం పార్టీలో నిస్తేజానికి నిద‌ర్శ‌నంగా నిలిచింద‌ని విశ్లేష‌ణ‌లు వినవ‌స్తున్నాయి. ఓ వైపు కేసుల్లో జ‌గ‌న్ రెడ్డి త‌మ్ముడు బాబాయ్ ఇరుక్కోవ‌డం, జ‌గ‌న్ రెడ్డి దంప‌తుల‌పై ఆరోప‌ణ‌లు రావడం..సీబీఐ నేడో రేపో త‌మ్ముడిని అరెస్ట్ చేయ‌డం ఖాయ‌మ‌ని తేల‌డంతో వైసీపీ పెద్ద‌త‌ల‌కాయ‌లే ఆవిర్భావ దినోత్స‌వంపై ఆస‌క్తిగా లేరు. మ‌రోవైపు వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డిని దూరం పెట్ట‌డంతో ఆయ‌న కూడా ప‌ట్టించుకోవ‌డంలేదు. మ‌రోవైపు ప్ర‌జావ్య‌తిరేక‌త తీవ్రం కావ‌డం, స‌ర్వేల‌న్నీ వ్య‌తిరేకంగా రావ‌డం, ఢిల్లీ లిక్క‌ర్ కేసులో వైసీపీ ఎంపీ, వైసీపీ ఎంపీ అల్లుడు అన్న బుక్ కావ‌డం వంటి ప‌రిణామాల‌తో వైకాపా ఆవిర్భావ దినోత్స‌వం చ‌ప్ప‌గా సాగింద‌ని, కీల‌క‌నేత‌లు కూడా పాల్గొన‌క‌పోవ‌డంతో కేడ‌ర్ దూరం అయ్యార‌ని తెలుస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read