నిన్న అసెంబ్లీలో జగన్ చెప్పిన సత్య దూరం అయిన వ్యాఖ్యల పై, తెలుగుదేశం పార్టీ, జగన్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. రైతులకు ఇచ్చే సున్నా వడ్డీ రుణాల విషయంలో సభను జగన్ తప్పుదోవ పట్టించారని తెలుగుదేశం పార్టీ చెప్పింది. నిన్న అసెంబ్లీలో కరవు పై జరిగిన చర్చ సందర్భంగా అసెంబ్లీని జగన్ తప్పుదోవ పట్టించారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఈ రోజు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత క్వషన్ హవర్ సమయంలో నిమ్మల మాట్లాడారు. ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబుని హేళన చేస్తూ జగన్ సభలో మాట్లాడారని అన్నారు. అసెంబ్లీలో ఛాలెంజ్ ఛాలెంజ్ అంటూ, మీరు రాజీనామా చేస్తారా అని సవాల్‌ చేశారని జగన అన్నారని చెప్పారు. వడ్డీలేని రుణాలు ఎంతమొత్తం ఇచ్చామన్నది రికార్డులతో సహా మీకు ఇస్తున్నాం అని స్పెకర్ కు తెలిపారు. రైతులకు వడ్డీ లేని రుణాలు రద్దు చేశారని అసత్యాలు మాట్లాడటం మంచిది కాదని అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం వడ్డీలేని రుణాల కింద 2013-14లో రూ.349 కోట్లు చెల్లించారని, 2014-15లో రూ.44 కోట్లు చెల్లించారని, 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.570 కోట్లు పెండింగ్‌లో ఉందని అన్నారు. ఇటీవల జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఈ నిధులను విడుదల చేయాలని జగన్‌ను కోరితే ఆయన నిరాకరించిన విషయం నిజమా కాదా అని ప్రశ్నించారు. వడ్డీలేని రుణాల పథకం రద్దుచేశారని, రూపాయి కూడా ఇవ్వలేదని జగన్ అసత్యాలు మాట్లాడారని టిడిల్పీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో రూపాయి ఇవ్వలేదని, ఎంత మొత్తం ఇచ్చామో లెక్కలతో సహా చూపిస్తామన్నామని అచ్చెం నాయుడు అన్నారు. మరి ఈ ఆధారాలు అన్నీ ఇచ్చిన దాని పై స్పీకెర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read