ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల వేట కొనసాగిస్తూనే ఉంది. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రూ.2 వేల కోట్లు అప్పుని తీసుకుంది. గత వారం రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.5 వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొచ్చింది. రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బండ్లను వేలం వేసి, ఈ నిధులను సేకరిస్తుంది. ఈ రోజు రూ.వెయ్యి కోట్లను 8 ఏళ్ల కాలానికి, 7.63 శాతం వడ్డీతో ఒకటి, అలాగే మరో రూ.వెయ్యి కోట్లను 5 ఏళ్ళ కాలానికి 7.46 శాతానికి సెక్యూరిటీ బాండ్లను వేలం వేసి, రుణంగా సమీకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.36 వేల కోట్లను FRBM కింద రుణ పరిమితి ఇచ్చారు. అయితే ఈ రూ.36 వేల కోట్లలో గత వారం రోజుల్లోనే, రూ.5 వేల కోట్లను సెక్యూరిటీ బండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. అయితే ఈ రూ.36 వేల కోట్లలో, ఇప్పటికే రూ.5 వేల కోట్లు తీసుకోవటంతో, ఇంకా రూ.31 కోట్లు మాత్రమే పరిమితి ఉంది. ఒక్కసారి ఈ FRBM పరిధి ముగిసిపోతే, ప్రతి వారం ఢిల్లీ వెళ్లి, ఆర్ధిక మంత్రి, అధికారులు అక్కడకు వెళ్లి, అందరి కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రూ.31 వేల కోట్లు గట్టిగా మూడు నెలల్లోనే మనోళ్ళు లాగేస్తారని, ట్రాక్ రికార్డు చూస్తేనే అర్ధం అవుతుంది. ఈ రూ.31 వేల కోట్లు అయిపోతే, మళ్ళీ మనోళ్ళు ఢిల్లీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి.

rbi 18052022 2

గత ఏడాది కూడా ఇలాగే దాదాపుగా నాలుగు నెలల ముందే రుణ పరిమితి అయిపోవటంతో, ప్రతి వారం కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్ధిక శాఖ చుట్టూ తిరిగితేనే, ఆ రుణం ముట్టింది. ఈ ఏడాది మాత్రం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రానికి రుణ పరిమితి ఇచ్చే సమయంలో, అన్ని లెక్కలు చెప్పాలని కోరింది. 26 పేజీల లేఖను కేంద్ర ఆర్ధిక శాఖ, రాష్ట్రానికి రాసినా కూడా, రాష్ట్ర ప్రభుత్వం వివరాలు ఇవ్వలేదు. ఆ తరువాత, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, అంటే బడ్జెట్ లో చూపని అప్పుల వివరాలు కూడా, తమకు సమర్పించాలని, ప్రినిసిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు అడిగింది. ముఖ్యంగా కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థలు ద్వారా తీసుకొచ్చిన అప్పులు వివరాలు ఇవ్వాలని లేఖలు రాసింది. అవి ఇస్తేనే, తాము ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి, ఆదాయ పట్టిక రూపొందించి, అప్పులు ఇస్తామని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు, ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు. ఆదాయం లేకపోవటంతో, మళ్ళీ అప్పులతో నెట్టుకుని వస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read