జగన్ మోహన్ రెడ్డి పై, ఆర్ఎస్ఎస్ పత్రిక ‘ది ఆర్గనైజర్‌’ రాసిన కధనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏకంగా జగన్ విధానాలతో, ఈ దేశ విచ్చన్నం జరిగే ప్రమాదం ఉందీ అంటూ, ‘ది ఆర్గనైజర్‌’ రాసిన తీరు చుస్తే, జగన్ విషయంలో ఆర్ఎస్ఎస్ ఎంత ఆగ్రహంగా ఉందో అర్ధం అవుతుంది. బహుసా అందుకే కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా, వైసీపీని ఈ మధ్య దూరం పెడుతుందా అనే చర్చ కూడా జరుగుతుంది. ఈ నెల 17న ఆర్ఎస్ఎస్ నడిపే ‘ది ఆర్గనైజర్‌’ లో, "జగన్ ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేస్తున్న తీరు, మత మార్పిడులు చేస్తున్న తీరుతో, భారతదేశం విచ్చిన్నం అయ్యే ప్రమాదం" అనే టైటిల్ తో ఒక ఆర్టికల్ రాసింది. అందులో జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం పాశ్చాత్య దేశాల్లో ఉన్న క్రిస్టియన్‌ మిషనరీ అజెండాని మన దేశంలో, అంటే ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్నారని, ఈ అజెండాతో మన దేశం కూడా విచ్ఛిన్నమయ్యే అవకాసం లేకపోలేదు అంటూ హెచ్చరిస్తూ, రాసింది. కేవలం అధికారం కోసం, ప్రమాదకరమైన హిందూ వ్యతిరేక అజెండాని అమలు చేస్తున్నారని ఆరోపణలు చేసింది. ఇదే కధనంలో జగన్ తో పాటు, ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, బావ బ్రదర్ అనిల్ పేర్లు కూడా ప్రస్తావించింది. రాష్ట్రాన్ని క్రీస్టియన్ పరం చేయటానికి మత మార్పిడులు చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేసింది.

rss 22072021 2

అంతే కాకుండా, ఈ అజెండా బయట పెడుతూ, దేవాలయాల పై జరిగిన ఘటనలు ప్రస్తావించిన సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజునే అంతం చేసే కుట్ర జరిగిందని, ఆ కధనంలో వెల్లడించింది. చరిత్రలో వలస పాలకులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినట్టు, ఇప్పుడు కూడా అక్కడ విధ్వంస రచన సాగుతుంది అంటూ ఆరోపణలు చేసింది. ఎమర్జెన్సీ కాలంలో కూడా నాయకులను రఘురామకృష్ణంను కొట్టినట్టు కొట్టలేదని ఆరోపించింది. ఇప్పుడు జగన్ అజెండాను వ్యతిరేకిస్తే రేపు పదనిని, సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను, హోంమంత్రిని కూడా ఇలాగే టార్గెట్ చేస్తారేమో అంటూ తన కధనంలో రాసింది. అలాగే జగన్ మోహన్ రెడ్డి అక్రమఆస్తుల కేసులు కూడా ప్రస్తవాన చేసింది. జగన్ అసలు ఏమి ఉద్యోగం చేసారని, ఏమి వ్యాపారం చేసారని, ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయని ఆరోపించింది. సిబిఐ రైడ్స్ జరిగిన సమయంలో, ఆ ఇల్లు చూసి ఆశ్చర్యపోయారని తన కధనంలో తెలిపింది. అయితే బీజేపీకి చెందిన ఆర్ఎస్ఎస్ లో ఇంత ఘాటుగా కధనం రావటం పై, రాజకీయంగా కూడా చర్చ జరుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read