అదానీ గ్రూప్ చైర్మెన్ సోదరులు ఇద్దరూ నిన్న తాడేపల్లి వచ్చి జగన్ మోహన్ రెడ్డిని కలిసి వెళ్ళారు. అయిత ఈ వార్త రెండో కంటికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయం ఈ రోజు మీడియా చానల్స్ లో వచ్చింది. నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ కు ప్రత్యేక విమానంలో వచ్చిన అదనీ సోదరులు, సాయంత్రం 3.40 నిమిషాలకు తిరిగి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకుని ప్రత్యేక విమానం ద్వారా, వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో, ఉత్తరాంధ్రలోని గంగవరం పోర్ట్ ని, అదానీ గ్రూప్ స్వాధీనం చేసుకుంది. అయితే ఇందులో ముఖ్యంగా ప్రభుత్వ వాటాని కూడా అదానీకి అప్పచెప్పటం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీని పైన హైకోర్టులో కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. ఈ లిటిగేషన్ కోర్టుకు వెళ్ళటం, అదే విధంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం పైన హైకోర్టులో డివిజనల్ బెంచ్ విచారణ చేపట్టిన తరుణంలో, ఇప్పుడు అదానీ వచ్చి, జగన్ ని కలవటం పై, ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. అదే విధంగా ఇటీవల కాలంలో, అదానీ గ్రూప్, కృష్ణపట్నం పోర్ట్ తో పాటుగా, ఇప్పుడు గంగవరం పోర్ట్ ని కూడా స్వాధీనం చేసుకుంది. అయితే గంగవరం పోర్ట్ స్వాధీనం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీని వెనుక పెద్ద కుంభకోణం ఉందని ఆరోపణలు వస్తున్నాయి.

meeting 13092021 2

గంగవరం పోర్ట్ లో ఉన్న 17 శాతం ప్రభుత్వ వాటాని కూడా, అదానీ గ్రూప్ కు ఇవ్వటం పై విమర్శలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం పారదర్శకంగా జరగలేదని, రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. దీని పైనే నిన్న అదనీ, జగన్ మధ్య ప్రధానంగా చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల కలంలో ఈ వ్యవహారం మొత్తం వివాదాస్పదం కావటంతోనే, ఈ భేటీ ఇప్పుడు జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఇలా ఉంటే, ఇంత పెద్ద మీటింగ్ జరిగినా, ఈ భేటీని సీక్రెట్ గా ఉంచారు. ఎక్కడా బయటకు తెలియనివ్వలేదు. అధికార వర్గాలు కూడా ధృవీకరించ లేదు. దీంతో ఈ అంశం పై మరింత అనుమానాలు బలపడుతున్నాయి. దాదాపుగా 9 వేల కోట్ల విలువగల వాటాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంటే, వందల కోట్లలోనే విక్రయం జరిగింది అనేది ఆరోపణ. రాష్ట్రంలో ఆస్తులు అన్నీ అదానీ పరం చేస్తున్నారని, ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ఈ సీక్రెట్ భేటీ ఎందుకు జరిగింది ? ఏమి నిర్ణయాలు తీసుకున్నారో తెలియాలి అంటే, కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read