ప్రతిపక్షంలో ఉండగా, జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో, మేము అగ్లీ సీన్స్ చూపిస్తాం అని చెప్పి, రోజా, కొడాలి నాని, చెవిరెడ్డి లాంటి వాళ్లతో ఎలాంటి రచ్చ చేసారో, అందరూ చూసారు. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చారు. 151 మందితో ఘన విజయం సాధించారు. అసెంబ్లీ మొదటి రోజు మాట్లాడుతూ, ఈ చెడిపోయిన వ్యవస్థను మార్చేస్తామని, చంద్రబాబు లాగే చెయ్యమని, అసెంబ్లీని ఎంతో హుందాగా నడుపుతాం అంటూ చెప్పుకొచ్చారు. జగన్ వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు అందరూ, జగన్ మారారు అని, సియంగా జగన్ ఇలా ఉండటం, రాష్ట్రానికి ఎంతో మచిందని అన్నారు. అయితే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి, అసెంబ్లీలో తన సహజ శైలిని చూపించారు. ఏయ్ ఏయ్ అంటూ ఆరుస్తూ, మేము 151 మంది ఉన్నాం, మేము తలుచుకుంటే మీ 23 మంది ఇక్కడ ఉండలేరు, జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఎదో ఒకసారి చెప్పారు అంటే ఆవేశంలో అన్నారు అనుకోవచ్చు. కాని ఈ మాట అన్న తరువాత, మళ్ళీ ఒక 15 నిమిషాలకు లెగిసి, నేను మళ్ళీ చెప్తున్నా అంటూ అదే బెదిరింపులు.

"ఒక్కసారి మేం డిసైడ్ చేస్తే, మీరు ఇక్కడ ఉండరు. మేం 151 ఎమ్మెల్యేలు ఉన్నాం, మీ వాళ్లు 23 మంది మాత్రమే ఉన్నారని గుర్తు ఉంచుకోండి. మేం తలుచుకుంటే మీలో ఒక్కరు కూడా అసెంబ్లీలో కనిపించరు. ముఖ్యమంత్రిగా నేను మాట్లాడుతుంటే నాకు అడ్డు తగులుతారా..?. ఏం ఏం ఏం ఇదేం పశువుల సంత అనుకున్నారా లేకుంటే శాసనసభ అనుకుంటున్నారా..?. ఎలాంటోళ్లను తయారు చేశారయ్యా.. మీరు.. మొత్తం రౌడీలను, గూండాలను తీసుకొచ్చారు. మీకు బాడీలు పెరిగాయి కాని, బుద్ధి పెరగలేదు.ఒక్కరికైనా బుద్ధుందా? అసెంబ్లీ ప్రొసీజర్ తెలుసా మీకు? ఏ రకంగా ఎమ్మెల్యేలు అయ్యారయ్యా? బుద్ధీ, జ్ఞానం లేకుండా ఉన్నారు మీరంతా. అవును... ఇలా కళ్లు పెద్దవి చేసి చూస్తే భయపడతారా? ఎవరూ భయపడరు. కూర్చో కూర్చోవయ్యా... అచ్చెన్నాయుడూ... కూర్చో... కూర్చో... కూర్చో అంటూ తెలుగుదేశం సభ్యుల పై తీవ్ర విమర్శలు చేసారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు మండిపడ్డారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read