ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది జరిగినా రచ్చ రచ్చ అవ్వాల్సిందే. అది ప్రభుత్వ నిర్ణయంలో తప్పో, లేక చూసే వాళ్ళది తప్పో కాని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం వివాదాస్పదం అవుతుంది. ఇప్పుడు ఏకంగా అత్యున్నత స్థానంలో ఉన్న ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు, బాధితులు. సహజంగా అధికారంలో ఉన్న వారు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు వినాల్సిందే. ఇప్పటికే దీని పై, అనేక విమర్శలు వస్తూ ఉన్నా, ఎవరూ పట్టించుకోరు కూడా. అయితే ఇది శ్రుతిమించి, ప్రజలకు ఇబ్బందులు కలిగించి, రాజకీయ నాయకులకు సేవ చేసే దాకా వెళ్తే, అది సమాజానికి ఇబ్బంది. ఈ ధరోని వల్ల, నిజాయితీగా ఉండే అధికారులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు షాక్ తిన్నారు. ఇక పై వీరు జగన్ మోహన్ రెడ్డి గుప్పెట్లోకి వేల్లిపోయినట్టే. ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకు సంబంధించిన వార్షిక నివేదిక ఆమోదించే అధికారం ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి దే. దీనికి సంబంధించి ఉత్తర్వులు వచ్చాయి. గతంలో కేవలం చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ లాంటి పెద్ద స్థాయి అధికారుల వార్షిక రిపోర్ట్ మాత్రమే సియంలు ఆమోదించే వారు. వీరి సంఖ్య 150 వరకు ఉండేది.

jagan 12042021 2

అయితే ఇప్పుడు తాజాగా జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో, ఆ సంఖ్య 150 నుంచి 465కు చేరుకుంది. సీనియర్ అధికారుల నుంచి గ్రౌండ్ లో పని చేసే జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారుల వరకు, ఇలా అందరూ ఈ జాబితాలోకి వస్తారు. అయితే ఈ నిర్ణయం నిజాయతీగా పని చేసే వారికి ఇబ్బంది కరంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వ పెద్దలు రాజకీయ అవసరాల కోసం, తీసుకునే నిర్ణయాలు, కొంత మంది అధికారులు ధిక్కరిస్తూ ఉంటారు. అయితే, ఇప్పుడు ఈ నిర్ణయంతో, వారు వెనక్కు తగ్గే అవకాసం ఉంది. ఈ రిపోర్ట్ ప్రకారమే, అధికారులకు పదోన్నతులు, కేంద్ర సర్వీసులకు వెళ్ళే అవకాసం ఉంటుంది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిని మంచి చేసుకునే క్రమంలో, వారు తల ఆడించక తప్పదు. ఎన్నో ఆశలతో అఖిల భారత సర్వీసుల్లోకి వచ్చే వారికి, ఇది పెద్ద దెబ్బ అనే చెప్తున్నారు. ఇదంతా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే ఒక అధికారి, కావాలని చేసారని, అధికార యంత్రాంగంలో కొంత మంది తన మాట వినని వారిని గుప్పెట్లో పెట్టుకోవటానికి, ఇలా చేసారని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read