చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండటమే వాళ్ళ టార్గెట్.. వారే దగ్గుబాటి దంపతులు. అందుకే మొన్న ఎన్నికల్లో భర్త వైసిపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, భార్య బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసారు. ఇద్దారు ఓడిపోయారు అనుకోండి అది వేరే విషయం. అయితే ఎన్నికల ముందు మాత్రం అటు పార్టీలకు కాని, ఇటు ఈ దంపతులకు కాని, ఇలా వేరు వేరు పార్టీల్లో ఉండటం పెద్ద ఇబ్బందిగా మారలేదు. ఇప్పుడు ఎన్నికలు అయ్యాక సీన్ రివెర్స్ కొట్టింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కాని, జగన్ మాత్రం అధికారంలోకి వచ్చారు. అయితే, ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఓడిపోతే పోయాం, ఎలాగు పార్టీ అధికారంలో ఉంది కదా, మన ఇష్టం అని అనుకున్నారు. ఆయన చెప్పినట్టే నియోజకవర్గంలో అధికారులు మాట విన సాగారు. కొన్ని బదిలీలు కూడా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పినట్టే జరిగాయి. అయితే ఎక్కడ తేడా కొట్టిందో కాని, ఈ పరిణామం జగన్ కు నచ్చ లేదు.

daggubati 12102019 2

ఎన్నికల ముందు, దగ్గుబాటి పార్టీలో చేరారని, పర్చూరు వైసిపీ నేత టిడిపిలో చేరారు. అయితే ఇప్పుడు జగన్, ఆ టీడీపీ నేత రావి రామనాథంబాబుని పార్టీలోకి ఆహ్వానించి, పర్చూరు బాధ్యతలు చూసుకోమని, ఆయన మాటకు ప్రాముఖ్యత ఇవ్వాలని, అక్కడ అధికారులకు, పార్టీ నేతలకు చెప్పారు. అయితే, ఇంత జరుగుతున్నా ఈ విషయం మాత్రం దగ్గుబాటికి చెప్పలేదు. దీంతో దగ్గుబాటి, జగన్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు. అసలు విషయం ఏమిటో తేల్చుకోవాలని అనుకుంటున్నారు. అయితే జగన్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్న దగ్గుబాటికి అటు వైపు నుంచి షాకింగ్ రెస్పాన్స్ వచ్చింది. మీరు జగన్ తో భేటీ అయ్యే ముందు, ఒక విషయం స్పష్టం చెయ్యాలి, మీ భార్య పురందేశ్వరి వేరే పార్టీలో, మీరు ఇక్కడ కుదరదు, ఏదో ఒకటి ముందు తేల్చుకోండి అని చెప్పటం, దగ్గుబాటి షాక్ అయ్యారు.

daggubati 12102019 3

ఎన్నికలు ముందు, ఇవన్నీ తెలుసు కదా, అప్పుడు లేని ఇబ్బంది, ఇప్పుడు ఎందుకు వచ్చింది అని ప్రశ్నించినా, అటు వైపు నుంచి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు దగ్గుబాటి ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో, జగన్ చేతిలో అవమానానికి గురయ్యాను అనే భావనలో ఉన్నారు. అయితే, పురందేశ్వరి బీజేపీ నేతగా ఉంటూ, జగన్ పరిపాలన పై విమర్శలు చెయ్యటం, తన ప్రభుత్వం పై, కేంద్రానికి ఫిర్యాదులు చెయ్యటం వంటివి జగన్ కు ఇబ్బందిగా మారిందని, అందుకే ఆమెను బీజేపీకి రాజీనామా చేస్తేనే, మీరు ఇక్కడ కొనసాగండి అంటూ, పొమ్మనలేక, పొగబెడుతున్నని, దగ్గుబాటి అర్ధమైంది. అయితే, బీజేపీ కేంద్రంలో చాలా బలంగా ఉండటం, పురందేశ్వరికి, బీజేపీ హైకమాండ్ లో మంచి పేరు ఉండటంతో, ఆమె బీజేపీ కి రాజీనామా చేసే అవకాశం లేదు. మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పార్టీ కి రాజీనామా చేస్తారా, జగన్ తో సయోధ్యకు వెళ్తారా అనేది చూడాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read