జగన్మోహన్‌రెడ్డి సీబీఐ కోర్టులో తనవాదనలు వినిపించే నేపథ్యంలో సదరు విచారణ సంస్థను బెదిరించే ధోరణిలో వ్యవహరించారని, తానేం చేశాను... ఏవిధమైన సాక్ష్యాలున్నాయో చూపాలని.. నేను ఏవిధమైన ప్రభావితం చేశానో చెప్పాలంటూ.. ఆయన మాట్లాడటం జరిగిందని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్ల రామయ్య స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడే జగన్‌ సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించాడని సీబీఐ చెప్పిందన్న వర్ల, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నఆయన కేసువిచారణను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగిందన్నారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రిగా తానుచేయవలసిన పనులు అనేకమున్నాయని గతంలోనే జగన్‌ చెప్పాడని, దానికి ప్రతిగా సీబీఐ సెలవు తీసుకోకుండా ఆదివారం కూడా పనిచేయాలని ఆయనకు సూచించడం జరిగిందన్నారు. ప్రజాసమస్యలపై పనిచేయా ల్సి ఉందని కోర్టుకి చెబుతున్న జగన్‌, అదే ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న టీడీపీ నేతలను ఎందుకు అరెస్ట్‌ చేయిస్తున్నారో సమాధానం చెప్పాలని రామయ్య డిమాండ్‌ చేశారు.

jagan 19102019 2

జగన్‌కు ఒకన్యాయం, టీడీపీనేతలకు మరోన్యాయమా అని ప్రశ్నించారు. టీడీపీ మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణ సీఎం డౌన్‌..డౌన్‌ అన్నాడని, ఆయన్ని అరెస్ట్‌చేశారన్నారు. ఇదే జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు, నాటిముఖ్యమంత్రి చంద్రబాబుని ఉద్దేశించి, శాసనసభసాక్షిగా ఎలాంటి మాటలన్నారో గుర్తించాలన్నారు. అలానే చంద్రబాబుని నడిరోడ్డుపై కాల్చిచంపాలని, ఆయన్ని చెప్పుతోకొట్టాలని, చొక్కాపట్టుకొని నిలదీయాలని అన్నప్పుడు జగన్‌పై నాటిప్రభుత్వం ఎన్నిసార్లు, ఎన్నికేసులు పెట్టిందో చెప్పాలని రామయ్య నిలదీశారు. జగన్‌, ఆయనపార్టీ సభ్యులు మాట్లాడిన మాటలకంటే, డౌన్‌.. డౌన్‌ అనడం నేరమెలా అవుతుందన్నారు. నవంబర్‌18, 2017లో సీబీఐకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ, ''మీ తీరుతో విసిగిపోయాం రెండేళ్లుగా అనవసరవాదనలతో సమయం వృథాచేశారు. ముప్పైఏళ్ల అనుభవంలో ఇలాంటి పరిస్థితి నేను చూడలేదు..ఇప్పటివరకు జరిగిన ఆలస్యం చాలు'' అన్నది నిజమా..కాదా అని వర్ల ప్రశ్నించారు. టీడీపీనేతలు, కార్యకర్తలపై పెట్టే కేసులకన్నా జగన్‌పై ఉన్న కేసులు చాలా తీవ్రమైనవన్నారు. 14-09-2012న జగన్‌ ఆర్థికనేరాల గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆఫ్తాబ్‌ఆలం వ్యాఖ్యానిస్తూ... ఇంతతక్కువ వ్యవధిలో ఇన్నివేలకోట్లు ఎలావచ్చాయని, ఒకవ్యక్తి కేవలం పదేళ్లలో వేలకోట్లు ఎలా సంపాదించాడని ప్రశ్నించినమాట వాస్తవమా కాదా అన్నారు.

jagan 19102019 3

05-10-2012న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సదాశివం, జస్టిస్‌ ఎమ్‌.వై. ఇక్బాల్‌ కేసువిచారణలో మాట్లాడుతూ దేశ ఆర్థికవ్యవస్థను నాశనంచేసిన ఆర్థికనేరగాళ్లను శిక్షించకపోతే మొత్తం సమాజమే నష్టపోతుందని, హత్యలు ఆవేశకావేశాలతో జరిగితే, ఆర్థికనేరాలు మాత్రం నిర్దిష్టలెక్కలు, ఉద్దేశపూర్వకప్రణాళిక, సామాజికప్రయోజనాలకు భంగకరంగా, వ్యక్తిగతలాభాలకోసమే చేస్తారని చెప్పడం, జగన్‌పై వచ్చిన అభియోగాలు కావా అని టీడీపీనేత నిగ్గదీశారు. ఆర్థికనేరాలను తీవ్రంగా పరిగణించాలని, ఆర్థికనేరాల వెనుక లోతైన మూలాలుంటాయని, వాటివల్ల ప్రజాధనానికి ముప్పువాటిల్లుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆర్థికనేరాలు పెనుముప్పుగా పరిణమించాయని, ఆర్థికనేరగాళ్లను శిక్షించకపోతే సమాజం నష్టపోతుందని, 2013లో సుప్రీంకోర్టు జగన్‌ కేసుల్లో చేసిన వ్యాఖ్యానాలు ఆయనకు తెలియవా అని రామయ్య ప్రశ్నించారు. కోర్టుహాజరు నుంచి తనకు మినహాయిం పు కావాలంటున్న జగన్మోహన్‌రెడ్డి, తనపై ఉన్నకేసుల విచారణను వేగవంతం చేయాలని , రూ.43వేలకోట్ల ప్రజాధనాన్ని కొట్టేశానని వస్తున్న ఆరోపణలపై త్వరగా స్పష్టత ఇవ్వాలని కోర్టులను ఎందుకు కోరడం లేదన్నారు. సీబీఐ వేసిన 11ఛార్జ్‌షీట్లు, ఈడీ వేసిన 5ఛార్జ్‌ షీట్లపై త్వరగా విచారణజరపమని జగన్‌ ఎందుకు కోర్టులను కోరడంలేదో, దానిపై బాధ్యతగల ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకు ఎందుకు వివరణ ఇవ్వడం లేదో ఆయన సమాధానం చెప్పాలని రామయ్య డిమాండ్‌చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కోర్టులనుంచి మినహాయింపుకోరుతున్న జగన్‌, ప్రజల తరుపున పోరాటం చేస్తున్న టీడీపీనేతలపై కేసులుఎలా పెట్టిస్తున్నాడో సమాధానం చెప్పాల ని, ఇదెక్కడి న్యాయమో ప్రభుత్వాధినేతే సమాధానం చెప్పాలన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read