2019 సార్వత్రిక ఎన్నికల్లో, ఘన విజయం సాధించి, మే 30, 2019న జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి, నిన్నటితో, ఆరు నెలలు అయ్యింది. ఈ ఆరు నెలల పాలన పై తెలుగుదేశం పార్టీ, జగన్ మోహన్ రెడ్డి ప్రోగ్రెస్ కార్డు ను రిలీజ్ చేసింది. ఆరు నెలల కాలంలో, "ఆపేసాడు, మూసేసాడు, రద్దు చేసాడు, కూల్చేసాడు, వెనక్కు పంపేశాడు, చేతులెత్తేసాడు, తాకట్టు పెట్టాడు, ముంచేసాడు, మాయ చేసాడు" అంటూ తెలుగుదేశం పార్టీ, జగన్ పాలన పై విరుచుకు పడింది. అంతే కాదు, జగన్ మోహన్ రెడ్డి పాలనకు, వందకు, సున్నా మార్కులు ఇచ్చింది. ప్రత్యేక హోదా గురించి కాని, రాష్ట్రంలో అభివృద్ధి కాని, ఈ ఆరు నెలల్లో పరిపాలన దక్షత కాని, పెట్టుబడులు కాని, ఏపి బ్రాండ్ ఇమేజ్ పడేయటంలో, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చెయ్యటంలో, నవరత్నాలు అమరాలు చెయ్యటంలో, ఇలా ఏ విషయంలోను జగన్ మోహన్ రెడ్డికి, ఒక్క మార్కు కూడా ఇవ్వకుండా సున్నా మార్కులు ఇచ్చింది.

sixmonths 011220198 2

శ్రీకాకుళం జిల్లా, రాజాం పట్టణ తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయం లో నిర్వహించిన మీడియా సమావేశంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు వైసీపి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు, వైసీపి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ విషయంలో కుంటిపడిందని, అమరావతి స్మశానం అయితే మీరు అక్కడ పరిపాలించేది రాక్షసుల అని ప్రశ్నించారు,ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని, పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండడంతో మరోసారి ప్రజలను మోసం చేసి ప్రలోభాలకు గురి చేస్తున్నారని, నిరుద్యోగ భృతిని ఆపి ఆరు లక్షల మంది నిరుద్యోగుల పట్టను కొట్టారని, రివర్స్ టెండరింగ్ లు, ఇరిగేషన్ పనులు రద్దు, పంచాయతీ ఆర్అండ్ బీ రోడ్లు ఆగిపోయాయని అన్నారు.

sixmonths 011220198 3

అలాగే, ప్రపంచ బ్యాంకు లు పెట్టుబడి ఇచ్చే పరిస్థితులు లేవని,ఆటో డ్రైవర్లకు 10 వేలు రూపాయలు ఇచ్చి ఫైన్ల రూపంలో ఇరవై వేలు వసూలు చేస్తున్నారని, ప్రభుత్వ స్కూళ్లకు,మహాత్మాగాంధీ విగ్రహాలకు అంబేద్కర్ విగ్రహాలకు పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేసి 1,400 కోట్ల ప్రభుత్వ ధనాన్ని వృథా చేశారని,ఆరు మాసాల పరిపాలనలో విధ్వంసం, వినాశనం, కక్ష సాధింపు చర్యలు, తిరగబడితే అక్రమ కేసులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం రాజకీయ టెర్రరిజం కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు వైసిపి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వానిది పిచ్చి తుగ్లక్ పరిపాలన అంటూ విరుచుకు పడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read