గతంలో జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా, నాకు 25 కి 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యెక హోదా తీసుకువచ్చి, మీ ముందు పెడతా అంటూ మీటింగుల్లో చెప్పారు. ప్రజలు ఆ మాటలు నమ్మారు. మోడీ నుంచి ప్రత్యెక హోదా తీసుకురావటం చంద్రబాబు వల్ల కాలేదు, జగన్ మోహన్ రెడ్డి అయితే, కేంద్రం మెడలు వంచి, ప్రత్యేక హోదా తీసుకు వస్తారని, భావించిన ప్రజలు, 25 కాకపోయినా, 22 ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించారు. అలాగే రాజ్యసభలో కూడా వైసీపీకి బలం బాగానే ఉంది. అయితే, గెలిచిన కొత్తలో, ప్రత్యెక హోదా గురించి మాట్లాడిన జగన్, మళ్ళీ ఏడాది తరువాత, ప్రత్యెక హోదా గురించి మాట్లాడారు. గెలిచిన కొత్తలో, ప్రధాని మోడీ దగ్గరకు వెళ్లి, అమిత్ షాని కలిసిన తరువాత, మీడియా ప్రత్యెక హోదా గురించి అడగగా, కేంద్రాన్ని ఇప్పుడు ప్రత్యెక హోదా గురించి అడిగే అవకాసం లేదు, మనం ప్లీజ్ సార్ ప్లీజ్ మాకు హోదా ఇవ్వండి, అని కేంద్రాన్ని అడగటం తప్ప ఏమి చేయ్యలేం అని జగన్ అన్నారు.

కేంద్రం మెడలు వంచి ప్రత్యెక హోదా తీసుకు వస్తాను అని చెప్పిన జగన్, ప్లీజ్ సార్ ప్లీజ్ అని హోదా గురించి అడుగుతూనే ఉండాలి అని చెప్పటంతో, అందరూ ఆశ్చర్యపోయారు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తరువాత ఒక మాట చెప్పి, ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు. అయితే అప్పటి నుంచి ప్రత్యెక హోదా విషయం మర్చిపోయారు. మీడియాలో కాని, సోషల్ మీడియాలో కాని, ప్రతిపక్షాలు కాని, గుర్తు చేస్తున్నా, ఏ నాడు దాని గురించి పట్టించుకోలేదు. అయితే, ఈ రోజు మళ్ళీ ప్రత్యెక హోదా పై స్పందించారు. తన పాలన పూర్తీ అయ్యి, ఏడాది అవుతున్న సందర్భంలో, ఈ రోజు జరిగిన సమీక్షలో, ప్రత్యెక హోదా పై స్పందించారు. కేంద్రం ప్రత్యెక హోదా ఇవ్వలేదు, ఇచ్చి ఉంటే ఎన్ని కంపెనీలు వచ్చేవి, కేంద్రానికి ఇప్పుడు మన అవసరం లేదు, అవసరం వస్తుంది, అప్పుడు ఒత్తిడి తెచ్చి హోదా తెస్తాం, ఇప్పటికి ప్రత్యెక హోదాకి దూరంగా ఉన్నాం కాని, ఏదో ఒక రోజు హోదా వస్తుంది అని జగన్ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read