కేంద్రం వార్నింగ్ ల ఫలితంతో, రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఏకంగా ప్రధాని కార్యాలయం రంగంలోకి దిగటం, కేంద్ర మంత్రి ఏకంగా జగన్ మోహన్ రెడ్డినే తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పటంతో, రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలపై మొన్నటి వరకు మొండి పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలక దిగొచ్చింది. ఇదివరకు ప్రభుత్వంలో చేసుకున్న పీపీఏల జోలికి వెళ్లబోమని కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఖరారు కాని ఒప్పందాలపైనే దృష్టి పెడతామని కేంద్రానికి రాసిన లేఖలో తెలిపింది. పాత ఒప్పందాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా ఏమైనా ఉంటే, వాటిని మాత్రమే సమీక్షిస్తామని కేంద్రానికి చెప్పింది. ఇక పై కొత్తగా ఒప్పందం చేసుకునే విద్యుత్ ఒప్పందాలలో కొత్త ధరలు నిర్ణయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చెప్పింది.

ppa 11092019 2

ఇప్పటికే పీపీఏల పై ఆంధ్రప్రదేశ్ చేసిన ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేసింది. పవర్ ప్రాజెక్టుల పై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ రెండు రోజుల క్రిందటే విమర్శలు గుప్పించారు. సరైన ఆధారాలుంటే విద్యుత్ రంగంలో పెట్టుబడులు వస్తాయని, అలా కాకుండా గుడ్డిగా వెళ్తున్నారని అన్నారు. తాము చెప్పినా జగన్ వినడం లేదని, కేంద్రం తరుపున అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరో పక్క ఇప్పటికే 42 కంపెనీలు హైకోర్ట్ కు వెళ్ళాయి. ప్రభుత్వం తమను వేధిస్తుందని, ఇప్పటికే అయిపోయిన ఒప్పందాల గురించి, ఇబ్బంది పెడుతుంది అంటూ, హైకోర్ట్ కు వెళ్ళటంతో, హై కోర్ట్ కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.

 

ppa 11092019 3

మరో పక్క ట్రిబ్యునల్ కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. అలాగే జపాన్ ప్రభుత్వం, ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో ఘాటు లేఖ రాసింది. మీ రాష్ట్ర ప్రభుత్వం వల్ల, మా పెట్టుబడిదారులు ఇబ్బంది పెడుతున్నారు, ఇలాగే కొనసాగితే మేము మీ దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచించే పరిస్థితి ఉంది అంటూ, లేఖ కూడా రాసింది. కేంద్రం ఎన్న సార్లు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది కూడా. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో ఏమి అధికారం ఉండదు, అంతా ట్రిబ్యునల్ చూస్తుంది, అనవసరంగా అపోహలు వద్దు, ఇలా అయితే రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఎలాంటి పెట్టుబడులు రావు అంటూ, రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలల నుంచి చంద్రబాబుని ఎలా అయినా ఇరికించాలి అని తీవ్ర ప్రయత్నాలు చేసిన జగన్, ఎట్టకేలకు , ఏమి లేదు అని తేలటంతో, వెనక్కు తగ్గారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read