చంద్రబాబు పై ఇప్పటికి అనేక ఎంక్వయిరీలు వేసారు. అసెంబ్లీ సాక్షిగా, 15 రోజుల్లో నీ బండారం మొత్తం బయట పడుతుంది అంటూ జగన్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే విజయసాయి రెడ్డి కూడా ప్రతి రోజు, జగన్ జైలుకు వెళ్తాడు అంటూ ట్వీట్లు వేస్తున్నారు. అయితే ఇప్పటికి దగ్గర దగ్గర మూడు నెలలు అవుతున్నా, వీళ్ళు బయట పెట్టింది ఏమి లేదు. చంద్రబాబు అవినీతి కొండను తవ్వుతున్నాం, తవ్వుతున్నాం అంటూ, ఇప్పటి వరకు తవ్వి తవ్వి, కనీసం ఎలుకని కూడా పట్టులేకపోయారు. చంద్రబాబు పోలవరంలో వేల కోట్లు అవినీతి, అమరావతిలో వేల ఎకరాలు అవినీతి, పట్టిసీమలో అవినీతి, దీంట్లో అవినీతి, దాంట్లో అవినీతి అంటూ, మొత్తం 6 లక్షల కోట్ల అవినీతి చంద్రబాబు చేసారని, జగన్ మోహన్ రెడ్డి తేల్చి, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పట్టులేక పోయారు.

నిజానికి జగన్ కంటే ముందే, ఎన్నికలకు ఇంకా ఏడాది ఉన్నది అనగా, బీజేపీ కేంద్రం నుంచి రంగంలోకి దిగింది. స్పెషల్ టీంలు పెట్టింది. ఏకంగా పీఎంఓలో ఒక అధికారి అన్నీ పర్యవేక్షణ చేసారు. ఎలా అయినా చంద్రబాబుని ఎదో ఒక అవినీతి కేసులో ఇరికించాలని సర్వ ప్రయత్నం చేసారు. కాని, చివరకు కేంద్రానికి కూడా ఏమి దొరకలేదు. అందుకే వేరే విధంగా జగన్ మోహన్ రెడ్డికి సహకరించి, గెలిపించారు. అయితే, అప్పుడు మోడీ వల్లే చంద్రబాబు పై అవినీతి మరక వెయ్యటం కుదరలేదు, మరి ఇప్పుడు జగన్ వల్ల అవుతుందా ? జగన్ కు కూడా అదే విషయం అర్ధమైనట్టు ఉంది. మూడు నెలలు తరువత అన్నీ సాధించి, చివరకు సెక్రటేరియట్ లో ఉన్న ఉద్యోగులను కూడా, చంద్రబాబు అవినీతి ఏమైనా చేస్తే చెప్పండి సన్మానిస్తాం అని చెప్పినా ఏమి దొరకలేదు, దొరకదు అని కూడా జగన కు అర్ధమైంది.

అందుకే ఇప్పుడు లోకేష్ ని టార్గెట్ చేసారు. లోకేష్ పని చేసిన పంచాయతీ రాజ్ శాఖ పై ప్రతి అంశాన్ని పరిశీలించి లోకేష్ కోసం వేట మొదలు పెట్టారు. ఇందులో భాగంగా, ముందుగా పంచాయతీ రాజ్ లో జరుగుతున్న అన్ని ఇంజనీరింగ్ పనులు ఆపివేస్తే జగన్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 144 పనులు ఆపేయమని ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఇప్పటి వరకు 25 శాతం పూర్తికాని ప్రాజెక్ట్ ల పై రివ్యూ కూడా చేసారు. ఇలా మొత్తం అన్నీ చూసి, విజయనగరం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు మినహా ఇతర జిల్లాల్లో అన్ని పనులు నిలిపివేసి, ఆ పనులను సమీక్షించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ పనులు ఆపటం వెనుక, లోకేష్ టార్గెట్ అనే వాదన బలంగా వినిపిస్తుంది. మరి చూద్దాం, ఇందులో అయినా ప్రభుత్వం ఏదైనా అవినీతి బయట పెట్టుద్ది ఏమో.

