వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, హడావిడిగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళటం, ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ఈ రోజు అనంతపురం జిల్లా పెనుగొండకు వెళ్లి, అక్కడ కియా ప్లాంట్ ని మళ్ళీ ప్రారంభించారు. ఆ పర్యటన ముగిసిన వెంటనే, ఆయన తాడేపల్లికి తిరిగి వచ్చారు. అయితే సడన్ గా, ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని, గన్నవరం ఎయిర్పోర్ట్ మార్గం క్లియర్ చెయ్యమని ఆదేశాలు రావటంతో, మళ్ళీ పోలీసులు హైరానా పడుతూ, బద్రతా ఏర్పాట్లు చేసారు. ఆయన గన్నవరం నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారని, సమాచారం వస్తుంది. అయితే, ఈ పర్యటన ఇంత హడావిడిగా ఎందుకు పెట్టుకున్నారు ? ఎవరిని కలుస్తారు, ఏంటి అనేది మాత్రం, ఎక్కడా అధికారిక స్టేట్మెంట్ అయితే రాలేదు. రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో ఉంటారని, పర్యటనలో భాగంగా, ఆయన ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో పాటుగా, పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారని సమాచారం.

jagandelhi 05122019 1

రేపు ఏదో ఒక సమయంలో, ప్రధానితో జగన్ భేటీ అవుతారని తెలుస్తుంది. ప్రధాని మోడీ అపాయింట్మెంట్ రేపు దొరకటంతోనే, హడావిడిగా ఢిల్లీ వెళ్ళారని, వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఒక పక్క పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే, ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది కూడా సస్పెన్స్ గా మారింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, తదితర అంశాల పై, ఆయన ప్రధానితో మాట్లాడతారని, అలాగే, డిసెంబర్ 26న స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్ కు రమ్మని, జనవరి నెలలో అమ్మఓడి పధకం ఓపెనింగ్ కు రమ్మని, ప్రధానిని పిలుస్తారని, తెలుస్తుంది. అయితే, గతంలో రైతు భరోసా కార్యక్రమానికి రావాల్సిందిగా జగన్ కోరినా, అప్పుడు ప్రధాని మోడీ రాని సంగతి తెలిసిందే.

jagandelhi 05122019 1

అయితే రెండు నెలల క్రిందట కూడా, ఇలాగే ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన జగన్ మోహన్ రెడ్డి, అప్పట్లో ఢిల్లీలో సరైన అపాయింట్మెంట్ లు దొరక్క, తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అమిత్ షా తో భేటీ కోసం, రెండు రోజులు వెయిట్ చేసినా, ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు. తరువాత, ఆయన పుట్టిన రోజు నాడు, వెళ్లి, విష్ చేసి వచ్చేసారు. అలాగే అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వకపోవటంతో, మరో ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా, అపాయింట్మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి, రద్దు చేసారు. దీంతో, అపట్లో ఈ సంఘటన పై జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. విజయసాయి రెడ్డి పై అసహనం వ్యక్తం చేసారు. ఇప్పుడు మరో సారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న సమయంలో, అంతా సాఫీగా సాగుతుందా, లేకపోతె బీజేపీ హైకమాండ్ ఏమైనా జర్క్ కు ఇస్తుందేమో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read