జగన్ మోహన్ రెడ్డి చాలా రోజుల తరువాత హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన హైదరాబాద్ వెళ్ళింది లేదు. నాలుగు నెలల క్రిందట వరదల సమయంలో, ఇక్కడ వరదలు ఉన్నా, హైదరాబాద్ పెళ్లికి వెళ్లి, విందు భోజనాలు చేయటం అప్పట్లో వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. మూడు నాలుగు సార్లు కేసీఆర్ ని కలవటానికి, రెండు సార్లు నాంపల్లి కోర్టుకు జగన్ వెళ్ళారు. కోర్టు వాయిదాలకు కూడా జగన్ వెళ్ళటం లేదు. విధి నిర్వహణలో బిజీగా ఉండి జగన్ వెళ్ళలేక పోయారని, కోర్టులో చెప్తూ మినహాయింపు పొందుతున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే, ఈ రోజు జగన్ హైదరాబాద్ వెళ్తుంది, ముచ్చింతల్‌లోని రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గునటానికి. చినజీయర్ స్వామి ఆహ్వానం మేరకు జగన్ వెళ్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3.50కి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో జగన్ మోహన్ రెడ్డి హైదరాబద వెళ్తారు. సాయంత్రం 4.30కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరకుని, అక్కడ నుంచే నేరుగా ముచ్చింతల్ ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ కార్యక్రమంలో పాల్గుని, అదే రోజు రాత్రికి వెంటనే తిరిగి తాడేపల్లి వచ్చేస్తారు. హైదరాబాద్ లో ఉన్న లోటస్ పాండ్ కి జగన్, ఈ మధ్య కాలంలో వెళ్ళలేదు. మరి అక్కడకు కూడా జగన్ వెళ్తారేమో చూడాలి మరి.
ఇక ముచ్చింతల్‌లో రామానుజాచార్యుల విగ్రహాన్ని రెండు రోజుల క్రితం ప్రాధాని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ముచ్చింతల్ లో 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని, ప్రధాని మోడీ జాతికి అంకితం చేసారు. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించి, రామానుజాచార్యులను కీర్తించారు. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవటం కూడా, వివాదాస్పదం అయ్యింది. కేసీఆర్ కు జ్వరంగా ఉందని, అందుకే ఆయన ఆ కార్యక్రమానికి రాలేదని తెలంగాణా సిఎంఓ ఆఫీస్ చెప్పింది. మరి ఈ రోజు జగన్ తో పాటు, కేసీఆర్ కూడా ఉంటారో లేదో చూడాలి. ఇక నిన్న సాయంత్రం ముచ్చింతల్‌లో జరిగిన, రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గున్నారు. సమతామూర్తి విగ్రహాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన రామానుజుల విగ్రహాన్ని దర్శించుకోవటం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే హైదరాబాద్ ఆధ్యాత్మిక రాజధానిగా మారనుందని పవన్ అన్నారు.