అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ధిక్కార స్వరాలు వినవస్తున్నాయి. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలు. కొందరు నేతల తీరుపై జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. నేతల మధ్య అంతర్గత స్పర్థలు ఉంటే వాటిని పార్టీ వేదికలపై చర్చించి పరిష్క రించుకోవాలని, వీధినపడి పార్టీ ప్రతిష్టకు భంగం కలి గిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తు న్నారు. నెల్లూరు నేతల మధ్య విభేదాలు, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలను జగన్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆయనకు షోకాజ్ నోటీ సులు పంపినట్లు తెలిసింది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రు లను వ్యక్తిగతంగా కలుసుకోలేక పోతున్నారు. ఒకవేళ కలిసేందుకు ప్రయత్నించినా అదినేత అపాయింట్ మెంట్ దొరకటం లేదని చెప్తున్నారు. పార్టీ కార్యక్రమాలు, మంత్రి వర్గ సమావేశాలు, శాసనసభ సమావేశాల ముందు జరిగే లెజిస్లేచర్ పార్టీ భేటీలు మినహా దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు వ్యక్తిగతంగా పార్టీ అధినేతను కలుసుకున్న దాఖలాలులేవని చెబుతున్నారు.

ycp 08122019 2

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు, కేంద్రంతో సంప్రతింపులు, సంక్షేమ పథకాల్లో ముఖ్యమంత్రి బిజీగా ఉండటం వల్ల ఎమ్మెల్యేలు, మంత్రులను కలుసుకోలేక పోతున్నారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జగన్ కు సన్నిహితంగా ఉన్న కొద్దిమంది మంత్రులు మినహా మిగిలిన మంత్రులు నియోజకవర్గాలకే పరిమితమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఈనెల 11న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఢిల్లీలో ఎంపీలకు ఇవ్వనున్న విందు పార్టీలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. పార్టీల కతీతంగా 300 మంది వరకు ఎంపీలను సీతాకాల విందుకు రఘురామ కృష్ణంరాజు ఆహ్వానించారు. సీనియర్ కాంగ్రెస్ నేత కేవీపీ నివాసంలో జరగనున్న ఈ విందుకు పలువురు కేంద్రమంత్రులు హాజరుకానున్నట్లు తెలిసింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షాలను కూడా ఆహ్వానించినట్లు చెప్తున్నారు. అయితే ఈ విందు రాజకీయంలో మతలబు ఏమిటనేది సస్పెన్స్ గా మారింది.

ycp 08122019 3

రఘురామకృష్ణంరాజు గత కొద్ది రోజులుగా ఢిల్లీలో కేంద్రమంత్రులు, బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరేందుకు రఘురామకృష్ణం రాజు పావులు కదుపుతున్నారనే ఆరో పణలు అప్పట్లో వినవచ్చాయి. దీనిపై ఆయన స్పందిస్తూ పార్టీ మారే యోచన లేదని స్పష్టం చేశారు. అయినా బీజేపీ నేతలను కలుసుకుంటే తప్పేంటని కూడా ప్రశ్నిం చారు. బీజేపీ నుంచి టీడీపీలో, అక్కడి నుంచి వైసీపీలో చేరిన ఆయన వ్యవహారశైలిపై పార్టీలో అంతర్గతంగా చర్చిస్తున్నట్లు తెలియవచ్చింది. లోకసభలో ప్రతిపక్ష పార్టీగా మూడవ స్థానంలో వైసీపీ ఉన్నప్పటికీ దాదాపు పది మంది ఎంపీలు కూడా పార్టీ అధినేత జగన్‌తో ఇప్పటి వరకు వ్యక్తిగతంగా భేటీ కాలేదని చెబుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, మరోవైపు టీడీపీతో రాజకీయ యుద్ధం, వలస నేతలతో బిజీగా ఉన్న జగన్ వైసీపీలో అంతర్గత విభేదాలపై దృష్టి సారించలేదని అంటున్నారు. దీంతో జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు నివు రుగప్పిన నిప్పులా మారుతోందనేది స్పష్టమవుతోంది. సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలతో వన్ టు వన్ చర్చిం చాలనే యోచనలో పార్టీ అధినేత ఉన్నట్లు సమాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read