ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ మ‌ద్ద‌తుతో పోటీచేసిన అభ్య‌ర్థి సీతంరాజు సుధాక‌ర్‌ని దారుణంగా ఓడించి మాకు వైసీపీ వ‌ద్ద‌ని నిన‌దించారు. విశాఖ రాజ‌ధాని పేరుతో వ‌స్తానంటోన్న సీఎం జ‌గ‌న్ రెడ్డిని కూడా మా వూరు రావొద్దు సారూ అంటూ వేడుకుంటున్నారు. గో బ్యాక్ సీఎం సార్ పేరుతో విశాఖ అంత‌టా ఫ్లెక్సీలు వెలిశాయి. జన జాగ‌రణ సమితి పేరుతో విశాఖ న‌గ‌రంలో ముఖ్య‌మైన ప్రాంతాల్లో అంటించిన ఈ పోస్ట‌ర్లు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి ఓడిపోయిన రోజే ప్ర‌త్య‌క్షం కావ‌డం వైసీపీలో క‌ల‌క‌లం రేపుతోంది. ఈ పోస్ట‌ర్ల‌లో అమరావతి రాజధాని నిర్మించాలనే డిమాండ్ కూడా ఉంది. జగదాంబ జంక్షన్, సిరిపురం, ఏయూ ప్రధాన గేటు, మద్దిలపాలెం, ఇసుకతోట, సీతమ్మ ధార, హెచ్ బీ కాలనీ, శాంతిపురంలో క‌నిపించిన ఈ పోస్ట‌ర్లు అధికార పార్టీలో వ‌ణుకు పుట్టించాయి.  వైసీపీ నేత‌లు ఈ పోస్ట‌ర్లు తొల‌గించుకుంటూ వెళ్లారు. మ‌రోవైపు జ‌న‌జాగ‌ర‌ణ స‌మితి ఎవ‌రిదో తెలుసుకోవాలంటూ పోలీసుల‌పై ఒత్తిడి చేస్తున్నారు. ఎన్నిక‌ల్లోనూ, మాములుగానూ విశాఖ వైసీపీని-జ‌గ‌న్ రెడ్డిని వ‌ద్దు పొమ్మంటోంద‌ని తేట‌తెల్లం అవుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read