ఢిల్లీ వెళ్ళిన జగన్ మోహన్ రెడ్డికి, ఎదురు చూపులు తప్పటం లేదు. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న జగన్, తన అధికార నివాసం 1-జన్‌పథ్‌కు పరిమితం అయిపోయారు. ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలుస్తారని చెప్పినా, ఇప్పటి వరకు అమిత్ షా ఆఫీస్ నుంచి, జగన్ కు కబురు రాలేదు. దీంతో మధ్యాహ్నం నుంచి, ఎదురు చూపులకే పరిమితం అయిపోయారు. మరో పక్క, కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తో రేపు, జగన్ కు అపాయింట్‌మెంట్‌ ఉన్నప్పటికీ, ఏ సమయంలో అనేది ఖరారు కాలేదు. మిగతా మంత్రులు కూడా ఎవరూ అందుబాటులో లేకపోవటంతో, జగన్ తన అధికార నివాసానికే పరిమితం అయిపోయారు. ఈ రోజు ఉదయం, విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన, పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం తరువాత, గన్నవరం విమానాశ్రయం నుంచి, జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం12.30 ప్రాంతంలో జగన్ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు.

shah 21102019 2

మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలు, ఈ రోజు జరగటంతోనే, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు బిజీగా ఉండడంతోనే, ఇంకా జగన్ కు ఎవరూ అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ఈ రోజు అపాయింట్మెంట్ దొరకటం కష్టం అని, రేపు ఏమైనా పిలుపు రావచ్చని అంటున్నారు. ఇప్పటికే గత 20 రోజుల్లో, జగన్ కు రెండు సార్లు అమిత్ షా అపాయింట్మెంట్ రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 5న హస్తిన వచ్చి ప్రధాని మోదీని కలిసినప్పుడే షాతో భేటీ అవ్వాలని అనుకున్నా కుదరలేదు. తరువాత, పోయిన వారం కూడా, అపాయింట్మెంట్ ఇచ్చినట్టే ఇచ్చే రద్దు చేసారు. మరి ఈ సారి, అమిత్ షా కలుస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే, జగన్ ఎందుకు, ఇలా అమిత్ షా అపాయింట్మెంట్ కోసం, పట్టు బడుతున్నారో అర్ధం కావటం లేదు. రాష్ట్రానికి సంబంధించి, ఏమైనా అత్యవసర సమస్య అంటే, అలాంటిది ఏమి కనిపించటం లేదు. దీంతో, ఇది రాజకీయ భేటీగా చూడాలని విశ్లేషకులు భావిస్తున్నారు.

shah 21102019 3

ముఖ్యంగా రివెర్స్ టెండరింగ్ లో డబ్బులు ఆదా చేసామని, అమిత్ షా కు చెప్పి, ఇదంతా చంద్రబాబు చేసిన స్కాం అని, కళ్ళ ముందే కనిపిస్తుంది అంటూ, అమిత్ షా ని ఒప్పించి, చంద్రబాబు పై ఏదైనా ఎంక్వయిరీ కోసం అడగటానికే, జగన్, అమిత్ షా ని కలుస్తున్నారు అనే వాదన విశ్లేషకులు వినిపిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం, జగన్ ఇంతలా అమిత్ షా ని కలవాలి అనుకోటానికి కారణం, సిబిఐ కోర్ట్ లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పిటీషన్ లో రిలీఫ్ కోసమని, సియం హోదాలో, ప్రతి శుక్రవారం కోర్ట్ కు వెళ్తే, రాజకీయంగా ఇబ్బంది అని భావించి, ఆ విషయం మాట్లాడటానికి, జగన్, అమిత్ షా ని కలవాలని అనుకుంటున్నారని, టిడిపి ఆరోపిస్తుంది. అయితే ఏపి ప్రజలు మాత్రం, ఇవేమీ వద్దు, ఎన్నికల ముందు చెప్పినట్టు, కేంద్రం మెడలు వంచి, ప్రత్యెక హోదా, విభజన హామీలు, సాధించుకుని, జగన్ వస్తే, చూడాలని ఉందని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read