వైసీపీనేతలు, మంత్రులు నిజంగా వారి తల్లిదండ్రులకే పుట్టిఉంటే, ఎలాంటి ఆంక్షలు, పోలీసుబందోబస్తు, కర్ఫ్యూలులేకుండా, మీడియాను అనుమతించి రాజధాని తరలింపు, సీఆర్డీఏ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిపితే వారి సత్తా ఏంటో తెలిసేదని టీడీపీనేత, మాజీఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ మండిపడ్డారు. గురువారం సాయంత్రం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. స్పీకర్‌గా తమ్మినేని పనికిరాడని, కోపంతో లేచివెళ్లిపోయే వ్యక్తికి ఆస్థానంలో కూర్చునే అర్హత లేదన్నారు. పదిమంది ఎమ్మెల్యేలు తనవద్దకు వస్తే, తట్టుకోలేకపోతున్నాడని, 22మంది మంత్రులు తనను చుట్టుముట్టినా మండలిఛైర్మన్‌ షరీఫ్‌ ఎక్కడా తొణకలేదన్నారు. 5 ఏళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్పప్పుడు సౌతాఫ్రికా వెళ్తాము.. సిలోన్‌ వెళ్తామని చెప్పకుండా, ఇప్పుడు అమరావతిలో తమకు అవసరమైన మేతలేనందున విశాఖకు వెళ్లడానికి సిద్ధమయ్యారని జలీల్‌ఖాన్‌ ఎద్దేవాచేశారు. స్టీల్‌ప్లాంట్‌, పోర్టు, విమానాశ్రయం, ఇతర సంస్థలు, కేంద్రప్రభుత్వ సంస్థలు ఉన్న విశాఖను జగన్‌ కొత్తగా అభివృద్ధి చేసేదేమీలేదన్నారు. విశాఖపట్నంలో రెండేరోడ్లున్నాయని, అక్కడంతా ఉప్పునీరుని, రైల్వేలైన్లు కూడా రెండే ఉన్నాయన్నారు.

విశాఖలో కొన్నివేల ఎకరాలున్నాయని, అమరావతిలో అమ్ముకోవడానికి ఏమీదొరక్కే అటుపరుగులు పెడుతున్నారని టీడీపీ నేత ఎద్దేవాచేశారు. పెద్దాయన అనే గౌరవంకూడా లేకుండా మండలిఛైర్మన్‌ను ఉద్దేశించి .. నువ్వు సాయిబుకే పుట్టావా...అని అంటున్న బొత్స, తానెవరికి పుట్టాడో సమాధానం చెప్పాలని జలీల్‌ఖాన్‌ మండిపడ్డారు. ముస్లింల భాషలో బొత్స అంటే అడుక్కునే చిప్ప అనిఅర్థమని, దానికి తగినట్లే బొత్స ప్రవర్తన కూడా ఉందన్నారు. చరిత్రలో, స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింలకు ఒకచరిత్ర ఉందని, అలాంటివారిని పట్టుకొని సాయిబు అంటే బట్టలూడదీసి కొడతారని బొత్స గుర్తుంచుకోవాలన్నారు. షరీఫ్‌పై దాడికి యత్నిస్తుంటే తల్లిపాలుతాగినవారిగా చూస్తూ ఊరుకునేదిలేదన్నారు. ముస్లింలుగా ఉన్నవారంతా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని, రాయలసీమలోని ముస్లింలు నేటికి తిండిలేకుండా ఉన్నారంటే, అందుకు రాజశేఖర్‌రెడ్డి కుటుంబమే కారణమన్నా రు. ముస్లింలు ఆత్మాభిమానంతో బతుకుతారు కానీ, జగన్‌లా ఆత్మవంచనచేసుకుంటూ బతకరని జలీల్‌ఖాన్‌ తేల్చిచెప్పారు.

విజయమ్మను విజయ అని పిలిచిన బొత్సకు మంత్రి పదవి ఇచ్చిన జగన్‌కు సిగ్గులేదన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, తెలంగాణ ఇచ్చేయాలని చెప్పిన బొత్స, ఆనాడు తాను ముఖ్యమంత్రి కావాలని పన్నాగం పన్నాడన్నారు. బెజవాడలో, తన నియోజకవర్గంలో తిరిగే పిల్లకాకి, దేవాదాయశాఖ చేస్తూ, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడన్నారు. ఆపిల్లకాకి తనస్థాయికి మించి మాట్లాడితే తగిన శాస్తి చేస్తామన్నారు. గాలిలో గెలిచినవారంతా నాయకులు కాలేరని, పరిస్థితి ఎలా ఉన్నా గెలిచేవాడే నిజమైన నాయకుడన్నారు. ఒక ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి, తనకున్న బలమేమిటో జగన్‌ మరోసారి తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో చీకటిరాజ్యం నడుస్తోందని, ఇక వెలుగులు ఎక్కడినుంచి వస్తాయన్నారు. చంద్రబాబు పై నమ్మకంతో 33వేలఎకరాలు ఇవ్వడాన్ని చూసి మోదీకూడా ఆశ్చర్యపోయాడన్నారు. రాష్ట్రానికి కొత్తగా ఆదాయం సమకూరాలని చంద్రబాబు అమరావతి కేంద్రంగా పాలన సాగించారని, దేశవిదేశాల వారిని ఆకర్షించడానికి ఆయన ప్రయత్నం చేశారన్నారు. లోకేశ్‌బాబుని కొట్టడానికి ప్రయత్నించిన వైసీపీమంత్రులకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఎన్‌ఆర్సీకి, సీ.ఏ.ఏకి వ్యతిరేకమని చెబుతున్న జగన్మోహన్‌రెడ్డి, కేరళమాదిరి చట్టసభల్లో ఆదిశగా ఎందుకుచట్టం చేయడంలేదన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read