రాష్ట్రంలో మరో మూడు వారాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతలు ప్రచార జోరు పెంచారు. ఈ సారి, 2014లో టీడీపీ-బీజేపీతో కలిసి పనిచేసిన జనసేన తాజా ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా నిలిచింది. ఇక జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల ప్రభావం దాదాపు లేనట్లే! హోరాహోరీగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో కలిసి బరిలో నిలిచిన జనసేన మూడో పక్షంగా నిలిచింది. టీడీపీ, వైసీపీలకు సవాలుగా మారింది. 2014 ఎన్నికల్లో నవ్యాంధ్ర ప్రజలు చంద్రబాబుపైనే నమ్మకం ఉంచారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడంతో పాటు సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువయ్యారు. తాను చేసిన అభివృద్ధి, సంక్షేమమే మళ్లీ తనను గెలిపిస్తాయనని చంద్రబాబు నమ్ముతున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కూడా ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచారు. చంద్రబాబుపై విమర్శల దాడిని తీవ్రతరం చేశారు. పోరు టీడీపీ, తమకు మధ్యేనని భావించారు. జనసేనను చాలా తేలిగ్గా తీసుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ను అసలు లెక్కలోకే తీసుకోలేదు. ఆయనది పార్టీనే కాదన్నట్లు చూశారు.

pk pk 24032019

ప్రచారంలో టీడీపీ, చంద్రబాబునే టార్గెట్‌గా చేసుకున్నారు. గతంలో వైసీపీ ఘోరంగా దెబ్బతిన్న ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాజకీయ వేదికలుగా పేరున్న కృష్ణా, గుంటూరు జిల్లాలపై జగన్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాజకీయ దురంధరులుగా పేరొందిన, ఓటమి ఎరుగని తెలుగుదేశం ముఖ్య నేతలపై గురి పెట్టారు. వారి బలాలు, బలహీనతలను బేరీజు వేశారు. వీరికి హైదరాబాద్‌లో ఆస్తులుంటే లొంగదీసుకునే బాధ్యతను పొరుగు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినట్లు తెలిసింది. నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగియనుంది. ఆ లోగా వారిపై చివరి అస్త్రాలను సంధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడు జగన్‌ నుంచి ఇచ్ఛాపురంలోని ఆ పార్టీ అభ్యర్థి దాకా అందరూ జనసేనను చూసి భయపడుతున్నట్లు తెలుస్తోంది. కారణం.. తాజాగా వైసీపీ రాజకీయ సలహాదారు ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) నిర్వహించిన సర్వే! ఆ సర్వేలో జగన్‌కు ఆందోళన కలిగించే విషయం వెల్లడైందని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

pk pk 24032019

ఇంతకాలం అధికార తెలుగుదేశం పార్టీపైనే దృష్టి సారించి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను జగన్‌ తేలిగ్గా తీసుకున్నారు. కానీ, పవన్‌ ప్రభావం ఏంటి? ఆయన వల్ల ఎదురయ్యే ఇబ్బందులేంటన్న విషయం పీకే నివేదికతో జగన్‌కు బోధపడినట్లు తెలుస్తోంది. కోస్తా జిల్లాల్లో పవన్‌ వైసీపీకి కలిగించే నష్టం ఏ మేరకు ఉండనుందో తెలుసుకున్నట్లు సమాచారం. అంతేకాదు పవన్‌ తన ప్రసంగాల్లో జగన్‌-కేసీఆర్‌, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలనూ ఎండగడుతున్నారు. భీమవరం సభలో తెలంగాణ సర్కారు, వైసీపీ నేతల తీరును కడిగిపారేసిన సంగతి తెలిసిందే. భయపడితే బెదిరిపోయేవారెవరూ లేరని, తెలంగాణలో ఆస్తులను లాక్కుంటారా? అదీ చూసుకుందామని.. సవాలు చేశారు. పవన్‌ ఎదురుదాడి ప్రారంభించడంతో జగన్‌ అప్రమత్తమైనట్లు సమాచారం. ఇకపై టీడీపీ అధినేత చంద్రబాబు కంటే పవన్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పవన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడిని కొనసాగించాలని వైసీపీ అభ్యర్థులకు జగన్‌ స్పష్టం చేసినట్లు సమాచారం. మొత్తంమీద పవన్‌ను చూసి వైసీపీ అభ్యర్థులు భయపడుతున్నారని రాజకీవర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read