గత మూడు రోజుల నుంచి జరుగుతున్న అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు, ఎంత ఉత్కంటకు దారి తీసాయో చూసాం. ముందు రోజు అసెంబ్లీలో, రెండు బిల్లు ప్రవేసిన పెట్టి, ఆమోదించిన ప్రభుత్వం, తరువాత రోజు శాసనమండలిలో అక్కడ బిల్ నెగ్గదు అని, మళ్ళీ మూడో రోజు అసెంబ్లీ సమావేశంలో, వెనక్కు వచ్చిన బిల్ ని మళ్ళీ అసెంబ్లీల ఆమోదిస్తే, శాసనమండలితో ఇక పని లేదని వ్యూహం పన్నారు. అయితే మొదటి రోజు సక్సెస్ అయిన ప్రభుత్వం, రెండో రోజు, మూడో రోజు, బోల్తా పడింది. దీని వెనుక చంద్రబాబుకి సహాయం చేసిన వ్యక్తి న్యాయవాది జంధ్యాల రవిశంకర్. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో, చర్చ సందర్భంగా, చంద్రబాబుకి ఇంకా అవకాసం ఇవ్వాలని, ఆయన స్పీచ్ అవ్వలేదు అని చెప్తున్నా, స్పీకర్ మైక్ కట్ చెయ్యటంతో, టిడిపి సభ్యులు ఆందోళన చెయ్యటంతో, వారిని సభ నుంచి సస్పెండ్ చేసారు. అయితే బయటకు వచ్చిన టిడిపి సభ్యులు, అసెంబ్లీ ముట్టడిలో గాయపడిన వారిని పరామర్శించటానికి, మందడం బయలుదేరితే, పోలీసులు వారిని అరెస్ట్ చేసారు.

cbn 23012020 2

అక్కడ చంద్రబాబుని అరెస్ట్ చేసి, రాత్రి 10 గంటల నుంచి, 12 దాటిన తరువాత కూడా, పోలీస్ వ్యాన్ లో తిప్పుతూనే ఉన్నారు. సరిగ్గా ఇక్కడే చంద్రబాబుకు టైం దొరికింది. తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని, న్యాయవాది జంధ్యాల రవిశంకర్ కు ఫోన్ చేసారు. మండలిలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి అనే దాని పై చర్చించారు. వైఎస్ఆర్ హయంలో, ఉమ్మడి శాసనసభకు ఈ లాయర్ న్యాయసలహాదారు. ఇదే అనుభవం ఉపయోగించి, రవి శంకర్, రూల్ 71 గురించి చంద్రబాబుతో చర్చించారు. ఆ రోజు రాత్రి అంతా, ఆ రెండు గంటల పాటు, చంద్రబాబు ఫోన్ లో నుంచి, అందరితో మంతనాలు జరిపి, ఈ రూల్ 71 పై ఒక క్లారిటీకి వచ్చారు. రూల్ 71 తోనే, ఈ ప్రభుత్వానికి బ్రేక్ వెయ్యవచ్చనే అంచనాకు వచ్చారు.

cbn 23012020 3

జంధ్యాల రవిశంకర్ తో ఆ రోజు రాత్రి 30 సార్లుకు పైగా ఫోన్ చేసారని, చివరి ఫోన్ రాత్రి 1:30 కు వచ్చిందని, మళ్ళీ ఉదయం 6 గంటలకే ఫోన్ చేసి, దీని పై ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా అయినా అమరావతిని, అక్కడ రైతులని కాపాడాలనే, చంద్రబాబు తపన చూసి, ఆశ్చర్యపోయానని, సాక్షాత్తు జంధ్యాల రవిశంకర్, ఒక టీవీ ఇంటర్వ్యూ లో చెప్పారు. రూల్ 71 అనేది ఒక చిన్న అస్త్రం మాత్రమే అని, దీని తరువాత ఎలాంటి అస్త్రాలు మేము బయటకు తీస్తామో మీరు చూస్తారని, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జంధ్యాల రవిశంకర్ చెప్పిన ఐడియా రూల్ 71 గురించి చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించటం, వ్యూహం పన్నటం, అనూహ్యంగా ఈ దెబ్బతో, ప్రభుత్వం ఇబ్బందుల్లో పడటం, చివరకు ఇది బ్రేక్ పడటం, వెంట వెంటనే జరిగిపోయాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read