జగన్మోహన్ రెడ్డి కో-వి-డ్ సమయంలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను పట్టించుకోకుండా, వారికి అవసరమైన ఆర్థిక చేయూతను అందించకుండా, వారి సొమ్ముని తనకు అవసరమైన వారికి, రాజ్యాంగ విరుద్ధంగా తాను చేస్తున్న పనులకు సహకరిస్తున్నవారికి కోట్లాది రూపాయలు దోచిపెడుతున్నాడని, టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! ఎవరినైతే ఆదుకోవాలో, ఎవరికైతే అండగా ఉండాలో, ప్రజల సొమ్ముని ఎవరికైతే ఖర్చుపెట్టాలో వారికి మాత్రం ఈ ముఖ్యమంత్రి రూపాయికూడా సాయం చేయడంలేదు. తాను చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేకమైన పనులకు సహకరించేవారికి మాత్రం భారీగా అదనపు సౌకర్యాలు, వసతలు కల్పిస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 9వ తేదీన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జాస్తి నాగభూషణం అనే న్యాయవాదిని ప్రభుత్వ రెండో అదనపు అడ్వకేట్ జనరల్ గా నియమించింది. అప్పటికే రాష్ట్రానికి ఒక అడ్వకేట్ జనరల్, మరొక అదనపు అడ్వకేట్ జనరల్ ఉన్నారు. అయినా కూడా అదనంగా నాగ భూషణాన్ని అదనపు అడ్వకేట్ జనరల్ గా నియమించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ, విభజన తర్వాత ఏపీలోగానీ, తెలంగాణలో గానీ రెండో అదనపు అడ్వకేట్ జనరల్ నియామకం జరగలేదు. ఒక అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్ ఉండటమనేది సహజంగా జరిగిందే. కానీ నాగభూషణంపై ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో జగన్మోహ న్ రెడ్డి ఆయన్ని రెండో అదనపు అడ్వకేట్ జనరల్ గా నియమించారు. అదనపు బెంచ్ లు లేకుండా, ఒకేఒక హైకోర్టు ఉన్న ఏరాష్ట్రంలోనూ కూడా ఇద్దరు అదనపు అడ్వకేట్ జనరల్స్ లేరు. జాస్తి నాగభూషణంపై జగన్మోహన్ రెడ్డికి ఎందుకంత ప్రత్యేక మైన అభిమానమో అందరూ ఆలోచించాలి. నాగభూషణమేమీ పెద్ద పేరు మోసిన, అనుభవమున్న న్యాయవాదేమీ కాదు . వృత్తిపరంగా ఎలాంటి గుర్తింపు లేకపోయినా కూడా ముఖ్య మంత్రి నాగభూషణానికి ఎందుకంత ప్రాముఖ్యతనిచ్చాడో అర్థంచేసుకోవాలి. నాగభూషణానికున్న ఏకైక అర్హత ఏమిటంటే, సుప్రీంకోర్టు మాజీన్యాయమూర్తి అయిన జాస్తి చలమేశ్వర్ కుమారుడు కావడమే. నా ప్రశ్నలపై ముఖ్యమంత్రిగానీ, జాస్తి నాగభూషణం గానీ సమాధానం చెప్పాలి.

తండ్రీకొడుకులైన జాస్తి చలమేశ్వర్, నాగభూషణాలకు నజరానాగా 09-12-2020న నాగభూషణాన్ని అదనపు అడ్వకేట్ జనరల్ గా నియమించారు. టీడీపీప్రభుత్వం, 2016లో ఇచ్చిన జీవోనెం-219ప్రకారం అదనపు అడ్వకేట్ జనరల్ కి, ఒక్కో అప్పియరెన్స్ కి రూ.7,500 మాత్రమే ఇస్తామనిచెప్పడం జరిగింది. ఆ జీవోకి మార్పులుచేసి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్చి 15-2021న జీవోనెం-69 ఇచ్చింది. దానిలో చీఫ్ సెక్రటరీతో సరిసమానంగా అదనపు అడ్వకేట్ జనరల్ కు కూడా ఇంటి అద్దె, (హెచ్ ఆర్ ఏ) ఇతరఅలవెన్సులు కల్పిస్తూ, జీవోఇచ్చారు. తిరిగి 12-03-2021న జీవోనెం-63తో అప్పియరెన్స్ కి రూ.7,500లుగా ఉన్నఫీజుని రూ.8,500లకు పెంచారు. రోజుకి గరిష్టంగా 5 అప్పి యరెన్సు లు ఉండాలనే నిబంధననుమార్చేసి, దాన్నిరోజుకి 8 అప్పియరెన్సులు చేశారు. అంటే రోజుకి రూ.68,000లు ఇచ్చేలా చేశారు. టీడీపీప్రభుత్వహాయాంలో గరిష్టంగా రూ.38వేలు మాత్రమే ఇచ్చేవారు. వాటితోపాటు, కేవలం ఈ ఐదునెలల్లోనే రూ.50లక్షలపైన అదనంగా జాస్తినాగభూషణం డ్రా చేశారు. 27-05-2021న ఇచ్చిన జీవోనెం-150చూస్తే, ఒకే జీవోలో రూ.9లక్షల18వేలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఒక్క మార్చినెలకే నాగభూషణాని కి రూ.9లక్షల18వేలు చెల్లించారు. హైకోర్టు అప్పియరెన్స్ లపేరుతో ఇలా లక్షలకులక్షలు తగలేస్తున్నదిచాలక, మరోపక్కన సుప్రీంకోర్టు అప్పియరెన్స్ ల కింద కూడా నాగభూషణానికి లక్షలకొద్దీ సమర్పిస్తున్నారు. ఫీజులుపెంచి, అప్పియరెన్స్ లుపెంచి, సౌకర్యాలుపెంచి, ఇలా అన్నిరకాలుగా నాగభూషణానికి దోచిపెడుతున్నారు. కోర్టులద్వారా శిక్షపడుతుందని తెలిసే ఈ ముఖ్యమంత్రి అడ్డగోలుగా న్యాయవ్యవస్థపై ఎదురు దా-డి చేస్తున్నాడు. ఏరోజు కూడా పట్టుమని పదికేసులు కూడా వాదించనివ్యక్తి, రాష్ట్రానికి అడిషనల్ అడ్వకేట్ జనరలా? ముఖ్యమంత్రి ఏరకంగా ప్రజలసొమ్ముని దోచిపెడుతున్నాడో అందరూ అర్థంచేసుకోవాలి. తానుచేస్తున్న రాజ్యాంగవిరుద్ధపదవు ల్లో నాగభూషణం తనకు సహకరిస్తున్నాడనే ముఖ్యమంత్రి అతనికి అన్నివిధాలా దోచిపెడుతున్నాడు. తాము లేవనెత్తిన అంశాలపై ప్రజముందుకొచ్చి ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read