తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వారి పై, జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, వారిని వేధిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూనే ఉంది, మరో పక్క ప్రతి రోజు ఇలాంటి ఘటన ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకుల పై ఏదో ఒక రకంగా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం, ఇప్పుడు తాజగా అనంతపురం మాజీ ఎంపీ, సీనియర్ నేత జేసీ దివాకర్‌ రెడ్డికి షాక్ ఇచ్చింది. జేసీ దివాకర్ రెడ్డి దూకుడుగా జగన్ పై ఆరోపణలు చేస్తూ ఉంటారు. మా వాడు మా వాడు అంటూ, చురకలు అంటిస్తూ ఉంటారు. అయితే జేసీ మాటలకు జగన్ పార్టీ మాత్రం హర్ట్ అవుతూ ఉండేది. ఇప్పుడు అధికారంలోకి రావటంతో, జేసీ దివాకర్ రెడ్డి వ్యాపారాలను టార్గెట్ చేసారు. ముఖ్యంగా ఆయనకు ట్రావెల్స్ బస్సులు ఉండటంతో, వాటి పై ఫోకస్ చేసారు. నిన్న రవాణా శాఖ ఆధ్వర్యంలో, అనంతపురంలో ఒకేసారి బస్సుల పై రైడ్ చేసారు.

diwakar 17102019 2

అన్ని పత్రాలు అడిగి, ఏవైతే తేడా ఉన్నాయో, వాటి పై ఆక్షన్ తీసుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయి అంటూ, 9 బస్సులను సీజ్ చేశారు. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన 23 ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియల్ బస్సుల పర్మిట్లనూ రద్దు చేశారు. నిబంధనలను అతిక్రమించినందుకే బస్సులు సీజ్ చేసి, కేసులు పెట్టమని, విచారణ కొనసాగుతుందని రవాణా శాఖ కమిషనర్‌ సీతారామాంజనేయులు వెల్లడించారు. అయితే దివాకర్ ట్రావెల్స్ మాత్రం, ఈ చర్యను ఖండించింది. అన్ని అనుమతులు ఉన్నాయని, చట్ట పరంగా తేల్చుకుంటామని అంటుంది. 30 ఏళ్ళుగా ఈ రంగంలో ఉన్నామని, ప్రతిది పక్కగా చేసుకుంటున్నామని, మాకు ఈ వేధింపులు కొత్త కాదని, చట్ట పరంగా తేల్చుకుంటామని అంటున్నారు.

diwakar 17102019 3

అయితే దీనికి ఒక్క రోజు ముందే, దివాకర్ రెడ్డి జగన్ పై ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఏపీలో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం వెనుక మాత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తంత్రం వుందని చెప్పారు. వైసీపీకి చెందిన అభ్యర్ధులు స్వల్ప మెజారిటీతో విజయం సాధించలేదన్నారు. ఒక్కో అభ్యర్ధి వేలాది ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం వెనుక మోడీ తంత్రం ఉందన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లు మంచి వ్యూహాకర్తలుగా జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు కూడ ఇదే కోవలోకి వస్తారని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో జగన్ గొప్ప ఏమి లేదని, అనుకుంటున్నానని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read