ఈ రోజు చంద్రబాబు ఇంటి ముట్టడికి కృష్ణా జిల్లా పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, వెళ్ళిన అంశానికి సంబంధించి, అత్యంత కీలకమైన సిసిటీవీ ఫూటేజ్, తెలుగుదేశం వర్గాలకు లభ్యం అయ్యాయి. జెడ్ ప్లస్ భద్రతతో పాటుగా, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కంమందర్స్ భద్రతలో ఉన్న చంద్రబాబు చుట్టూ అత్యంత శక్తివంతమైన సిసి టీవీ కెమెరాలను అమర్చారు. అటు పోలీసులతో పాటుగా, ఇటు చంద్రబాబు వ్యక్తిగత భద్రత చూసే వారు కూడా ఈ సిసి టీవీ ఫూటేజ్ ను నిరంతరం పరిశీలిస్తూ ఉంటారు. చంద్రబాబు నివాసంలో ఉన్న ప్రత్యెక కంట్రోల్ రూమ్ ద్వారా, సిసి టీవీ దృశ్యాలు కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలోనే, ఈ రోజు జోగి రమేష్, తన అనుచరులతో దాదపుగా 20 వాహనాలతో చంద్రబాబు నివాసం వద్దకు రావటంతో పాటుగా, వాళ్ళతో పాటు కర్రలు, రాడ్డులు, రాళ్ళు కూడా తెచ్చిన దృశ్యాలు, చంద్రబాబు ఇంటి మీదకు వెళ్తున్న దృశ్యాలు ఈ ఫూటేజ్ లో రికార్డ్ అయ్యాయి. దీంతో పాటుగా, వీళ్ళు అంతా అక్కడకు చేరుకునే సమయానికి అక్కడ సెక్యూరిటీ గా ఉన్న అవుట్ పోస్ట్ వద్ద ఉన్న డివైడర్ దగ్గరే బ్యారికేడ్ లు వేసేసారు. అయినప్పటి కూడా, వాళ్ళు నెట్టుకుని లోపలకు వస్తున్న దృశ్యాలు కూడా ఆ సిసిటీవీ ఫూటేజ్ లో నమోదు అయ్యాయి.

jogi 170909 2021 2

ప్రస్తుతం ఈ దృశ్యాలు ఈ మొత్తం సంఘటనలో కూడా కీలకంగా మారాయి. కొంత మంది వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతల పై చేయి చెసుకున విజువల్స్ కూడా టిడిపి నేతలకు దక్కాయి. ఇవన్నీ కూడా రేపు కేసు దర్యాప్తులో కీలక పాత్ర వహిస్తాయి. ఇవన్నీ టిడిపి నేతలు భద్ర పరిచారు. అలాగే చంద్రబాబు వ్యక్తిగంగా పెట్టుకున్న సిసి టీవీ కెమెరాల నుంచి కూడా సేకరించారు. రేపు పోలీసులు ఈ కేసు విచారణ చేయకపోతే, హైకోర్టుకు వెళ్లి, ప్రైవేట్ కేసు పెట్టాలని టిడిపి యోచిస్తుంది. అదే విధంగా ఈ దృశ్యాలు రేపు గవర్నర్ కూడా ఇచ్చే అవకాసం ఉంది. అయితే ఇది ఇలా ఉంటే నిన్నటి నుచ్నే జోగి రమేష్ సోషల్ మీడియాలో వీడియో పెట్టి బెదిరించారు. అలాగే ఈ రోజు అన్ని మీడియా చానల్స్ కు మెసేజ్ లు పంపించారు. ఇంత ప్లాన్ ప్రకారం చేసినా, పోలీసులు పట్టించుకోకపోవటం, అన్ని వాహనాలు, ఆయిదాలతో చంద్రబాబు ఇంటి మీదకు వస్తున్నా, చూస్తూ ఉండటం పై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏదో గొడవ కోసం వచ్చింది కాదని, ఇందులో పెద్ద ప్లాన్ కూడా ఉందని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read