ప్రభుత్వానికి మచ్చ తెచ్చే కధనాలు రాస్తే, 24 గంటల్లో కోర్ట్ కు వెళ్ళండి, అంటూ మీడియాని, సోషల్ మీడియాని అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది జగన్ ప్రభుత్వం. అంటే దీని ప్రకారం, ప్రభుత్వానికి భజన చేసే కధనాలే కాని, ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలు పై, ఎలాంటి కధనాలు రాయటానికి వీలు లేదు. అలా రాస్తే కేసులు పెట్టేస్తారు. అది ప్రింట్ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా, సోషల్ మీడియా అయినా. ఇది అమలు లోకి వస్తే, ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేస్తున్నా చూస్తూ కుర్చువాలి. ఎందుకంటె, ఏ ప్రభుత్వం మేము తప్పు చేస్తున్నాం అని ఒప్పుకోదు. మీడియా వేసిన ప్రతి వ్యతిరేక కధనం పై కోర్ట్ కు వెళ్తుంది. ఇలాంటి జీవోనే నిన్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో ఒకే చేసారు. పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్‌ మీడియాలో ప్రభుత్వ పరువుకి భంగం కలిగించే కద్భాలు రాస్తే, వాటి పై 24 గంటల్లోగా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి అంట.

jagan 17102019 2

సంబధిత శాఖల అధికారులు, 24 గంటల్లో కేసు పెట్టాలని, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ద్వారా సంబంధిత కోర్టులో కేసులు వేయాలని సూచించారు. అయితే ఇదే జీవో 2007 ఫిబ్రవరి 20న అప్పట్లో రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చారు. అయితే ఇది జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీంతో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం, ఈ విమర్శలకు వెనక్కు తగ్గింది. ఆ జీవో రద్దు చేస్తునట్టు అసెంబ్లీలో కూడా చెప్పారు. అయితే అప్పట్లో రద్దు చేసాం అని చెప్పిన జీవోని, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ తేవటం చర్చనీయంసం అయ్యింది. తప్పుడు వార్తలు అయితే ఒక పధ్ధతి. నిరాధార, పరువుకు భంగం కలిగించే వార్తలు పై కూడా కేసులు పెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం మాత్రం, అందిరకీ షాక్ కలిగించే అంశం.

jagan 17102019 3

అయితే మొన్నటి దాక, సాక్షి వేసిన కధనాలు అన్నీ ఇన్నీ కావు. మొన్నటి శేఖర్ రెడ్డి కధనాలే ఉదాహరణ. శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అని ఊదరగొట్టి, ఇప్పుడు టిటిడి ఇచ్చారు అంటే, ఎలాంటి విషం సాక్షి చిమ్మిందో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం మాత్రం, ఇలాంటి జీవో ఇచ్చింది. అయితే, ఈ జీవో పై జాతీయ స్థాయిలో జర్నలిస్ట్ లు నుంచి విమర్శలు వస్తున్నాయి. "Andhra Pradesh CM @ysjagan trying to ‘muzzle’ media? " అంటూ టైమ్స్ నౌ ట్వీట్ చేసింది. "CM @ysjagan ’s attempt to ‘gag’ the media reminds me of the Emergency situation of 1975" అంటూ R. RAJAGOPALAN అనే సీనియర్ జర్నలిస్ట్ అన్నారు. "If this information of alleged media gag and punishing those who don't put out "reports favourable to govt" then it's a big setback to the reputation of @AndhraPradeshCM Stiffling media voice not in favour of a healthy democracy @ysjagan Garu" అంటూ మరో సీనియర్ జర్నలిస్ట్ ట్వీట్ చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read