చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి తనను ఇబ్బంది పెడుతున్నారు అంటూ, గతంలో ఆయన అనేక సార్లు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఒక టీవీ ఇంటర్వ్యూ లో జగన్ పై అసభ్య వ్యాఖ్యలు చేసారు అంటూ ఆయన పై రాజద్రోహం కేసు పెట్టి, ఆయనను అరెస్ట్ చేసారు. ఇప్పటికే ఆయన్ను అరెస్ట్ చేసి రెండు నెలలు అవుతుంది. ఇప్పటికీ ఆయనకు బెయిల్ లభ్యత లేదు. వేసవి సెలవులు కావటం, వెకేషన్ బెంచ్ మాత్రమే పని చేస్తూ ఉండటంతో, ఆయన బెయిల్ పిటీషన్ విచారణ లేట్ అవుతుంది. ఈ రోజు ఆయన బెయిల్ పిటీషన్ పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణను 15వ తేదీకి వాయిదా వేస్తూ, కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జడ్జి రామకృష్ణ జ్యూడిషల్ కస్టడీ లో ఉండటమే మంచిదని, కోర్టు అభిప్రాయపడింది. కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారి తీసాయి. జడ్జి రామకృష్ణ తరుపున, మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ రావు వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. ఇప్పటికే జడ్జి రామకృష్ణ ఉంటున్న బ్యారెక్ లోని వ్యక్తి బెదిరించారని, తరువాత క-త్తి లభ్యం అవ్వటం, ఆయన్ను హాస్పిటల్ కు తరలించటం ఇవన్నీ జరిగిన విషయం తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read