చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాగా నియమితులు అయిన అయిన తరువాత, జస్టిస్ ఎన్వీ రమణ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఈ మధ్య కాలంలో కేంద్రం వైఖరి పై సుప్రీం కోర్టు, కొన్ని కఠిన నిర్ణయాలే తీసుకుంది. ముఖ్యంగా కో-ర-నా సందర్భంలో, కేంద్రం వైఖరి పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కొన్ని విషయాల్లో నేరుగా రంగంలోకి దిగి సమీక్షిస్తుంది. ఇవన్నీ ఒక పక్క సాగుతూ ఉండగానే, సుప్రీం కోర్టు పరిధిలో జరగాల్సిన మార్పులు కూడా చేస్తూ, కీలక నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజలకు మరింత జవాబుదారీ తనంగా ఉంటూ, తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది సుప్రీం కోర్టు. ఇందులో ముఖ్యంగా జస్టిస్ ఎన్వీ రమణ తీసుకుంటున్న నిర్ణయాలు, అన్ని వైపుల నుంచి, ప్రశంసలు అందుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ రోజు సుప్రీం కోర్టు, ఒక మోఅబిలే యాప్ ని తీసుకుని వచ్చింది. ఈ యాప్ ని జస్టిస్ ఎన్వీ రమణ ఈ రోజు ప్రారంభించారు. అంతే కాదు, త్వరలోనే న్యాయస్థానంలో జరిగే అన్ని కార్యకలాపాలు, ఇక నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయటానికి కూడా సిద్ధం అయినట్టు జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ఇది సుప్రీం కోర్టు చరిత్రలోనే ఒక కీలక పరిణామం.

ramana 13052021 2

ఎప్పటి నుంచో, న్యాయస్థానాల్లో జరుగుతున్న విషయాలు, ప్రత్యక్ష ప్రసారం చేయాలనే డిమాండ్ ఉంది. ఇప్పుడు జస్టిస్ ఎన్వీ రమణ, ఈ విషయం పై సిద్ధంగా ఉన్నామని, సహచరులను సంప్రదించి, దీని పై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక ఈ రోజు ప్రారంభించిన యాప్ గురించి ప్రస్తావిస్తూ, ఈ యాప్ కేవలం జర్నలిస్ట్ లు కోసమే తెచ్చామని, కోర్టులో జరిగే వ్యవహారాలు తెలుసుకోవటానికి, జర్నలిస్టులు, లయార్ల పై ఆధార పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, అందుకే వారికి కోర్టులో జరిగే విషయాలు చెరువు చేసేందుకు ఈ యాప్ తెచ్చినట్టు చెప్పారు. తాజా సమాచారం ఎప్పటికప్పుడు జర్నలిస్టులకు లభిస్తుందని అన్నారు. కోర్టులోకి రాకుండానే, జర్నలిస్టులు పూర్తి సమాచారం తెలుసుకోవచ్చని, త్వరలోనే లైవ్ స్ట్రీమింగ్ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని సీజేఐ ఎన్వీ రమణ చెప్పారు. కొద్ది రోజుల క్రితం, కోర్టులో జరిగే సంభాషణలు, మీడియాలో రాకుండా చూడాలని కొంత మంది కోరగా, అది కుదరదని, మీడియాపై ఆంక్షలు పెట్టం అంటూ సుప్రీం కోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read