క‌ర్ణాట‌క‌లో దారుణ ప‌రాజ‌యంతో ద‌క్షిణాదిలో బీజేపీ చాప్ట‌ర్ ముగిసింది. క‌ర్ణాట‌క‌లో మ‌ళ్లీ గెలిచి ద‌క్షిణాదిలో మ‌రిన్ని రాష్ట్రాల‌లో పాగా వేయాల‌ని స‌ర్వ‌శ‌క్తులూ వొడ్డిన బీజేపీ క‌ల‌లు క‌ల్ల‌ల‌య్యాయి. కేర‌ళ‌లో క‌మ‌లానికి సీన్ లేదు. త‌మిళ తంబీలు రానివ్వ‌రు. తెలంగాణ‌లో కాస్తా కూస్తో ఆశ‌లున్నా, క‌ర్ణాట‌క ఫ‌లితాల‌తో డైల‌మా నెల‌కొంది. తెలంగాణ‌లో బీఆర్ఎస్ ర‌హ‌స్య మిత్రులు చాలా బ‌లంగా ఉన్నారు. అక్క‌డ కేసీఆర్‌ని కొట్టాలంటే బీజేపీకి ఎవ‌రో ఒక‌రి మ‌ద్ద‌తు త‌ప్ప‌నిస‌రి. ఎంఐఎం, క‌మ్యూనిస్టులు అంతా కారు సారుతోనే ఉన్నారు. కాంగ్రెస్‌తో క‌ల‌వ‌లేరు. త‌మ ఆర్థిక‌, రాజ‌కీయ అవ‌స‌రాల‌కు వాడుతున్న జ‌గ‌న్ రెడ్డికి తెలంగాణ‌లో ఓటుబ్యాంకులేదు. తెలంగాణ‌లో తెలుగుదేశానికి బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. అక్క‌డ తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థులు మెజారిటీకి స‌రిప‌డా గెలిచి అధికారం ద‌క్కించుకోలేరు. కానీ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకుంటే అధికారం ద‌క్కేలా చేయ‌గ‌ల‌రు. ఇంకొక బ‌ల‌మైన పార్టీకి అధికారం ద‌క్క‌కుండా చేసే స‌త్తా తెలుగుదేశానికి ఉంది. బీజేపీ తెలంగాణ‌లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఢిల్లీ పెద్ద‌లు వ్యూహంగా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ ఒక్క‌టే బీజేపీకి ఆప్ష‌న్‌గా క‌నిపిస్తోంది. క‌ర్ణాట‌క‌లో దారుణ ప‌రాజ‌యం త‌రువాత తెలంగాణ‌లో బీజేపీ త‌మ వ్యూహాల‌ను పునఃస‌మీక్షించుకోవాల‌నుకుంటోంది. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణ‌లో కూడా కాంగ్రెస్ ఆశ‌లు మొల‌కెత్తాయి. కాంగ్రెస్ కూడా టిడిపి ఓటు బ్యాంకుతో చాలా సీట్లు గెల‌వొచ్చ‌ని, టిడిపితో టై అప్ కోసం య‌త్నించ‌వ‌చ్చిన రాజ‌కీయ ప‌రిశీల‌కుల అంచ‌నా.

Advertisements

Advertisements

Latest Articles

Most Read