టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఈ రోజు దసరా పండుగ సందర్భంగా, కొత్త పార్టీ పెడుతున్న సంగతి తెలిసిందే. తన మూల సిద్దాంతం అయిన తెలంగాణాను వదిలి పెట్టి, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చుతూ, ఈ రోజు ప్రకటన చేసి, జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టనున్నారు. అయితే కేసీఆర్ కొత్త పార్టీ పై, పెద్దగా అంచనాలు లేవు. ఇదంతా బీజేపీ ఆడిస్తున్న నాటకం అని వాదించే వారు కూడా ఉన్నారు. అయితే, ఈ విషయం పక్కన పెడితే, కేసీఆర్ చేస్తున్న సన్నాహాలు మాత్రం, భారీ స్థాయిలో ఉన్నాయి. కొత్త పార్టీ ప్రకటించిన వెంటనే, ఒక విమానం కొంటున్నారు. అలాగే మూడు నెలల పాటు, దేశ వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు పెట్టనున్నారు. మొదటి బహిరంగ సభ డిసెంబర్ 9న ఢిల్లీలో పెట్టనున్నారు. తరువాత సంక్రాంతి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ మీటింగ్ ఒకటి పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇందు కోసం అమరావతిలో కానీ, విజయవాడ, గుంటూరు మధ్య కానీ, కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా, ప్రస్తుతం తటస్తంగా ఉన్న వారిని, తన పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు కుడా కేసీఆర్ చేస్తున్నారు. ఇందలో భాగంగా ఇప్పటికే ఉండవల్లిని కేసీఆర్ తన పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే.

kcr 050102022 2

ఇక టిడిపి, వైసీపీ, బీజేపీ నుంచి కూడా కేసీఆర్ లాగుతారని వార్తాలు వస్తున్నాయి. వీటి అన్నిటి నేపధ్యంలో, అసలు ఏపిలో కేసీఆర్ సక్సెస్ అయ్యే అవకాసం ఉందా అనే చర్చ మొదలైంది. గతంలో కేసీఆర్ ఆంధ్రా వారిని తిట్టిన తిట్లు, అలాగే అమరావతిని నాశనం చేస్తున్న తీరు, పోలవరం ఆపటం, జల వివాదాలు, ప్రత్యేక హోదా , విభజన హామీలు, కరెంటు బకాయలు, ఇలా అనేక విషయాల్లో కేసీఆర్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న తరుణంలో, అసలు కేసీఆర్ ని ఏపిలో ఎవరు ఆదరిస్తారు అనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ అభివృద్ధి కోసం, జగన్ తో కలిసి అమరావతిని ఆపేయటంలో కేసీఆర్ పత్ర కూడా ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇన్ని ప్రతికూలతలు ఇక్కడ ఉంటే, ఇక్కడ వారి సహాయం లేకుండా, కేసీఆర్ ఏపిలో అడుగుపెట్టి బహిరంగ సభ పెట్టలేరు. ఈ నేపద్యంలోనే, ఏపిలో కేసీఆర్ కు సహకరిస్తుంది ఎవరు ? ఎవరా రహస్య మిత్రులు అనే చర్చ జరుగుతుంది. కాలం గడిచే కొద్దీ, ఇవన్నీ బయట పడతాయి. ప్రజలు ఎలాంటి నిర్ణయం తెసుకుంటారో చరిత్రే చెప్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read