జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్, ఈ రోజు, కేసీఆర్ ఇంట్లో సమావేశం అయ్యారు. వీరిద్దరూ, ముఖ్యమంత్రుల హోదాలో, ఇలా కలవటం ఆరోసారి. దాదపుగా నాలుగు నెలల తరువాత ఇద్దరూ కలిసారు. ఎన్నికలు అయిన మొదట్లో, తరుచూ కలిసిన నేతలు, తరువాత నాలుగు నెలలుగా కలవకపోవటం, అలాగే ఆర్టీసీ సమ్మె సమయంలో, కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాల పై, విమర్శలు చెయ్యటంతో, వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని అందరూ భావించారు. అయితే, నాలుగు నెలల తరువాత ఈ రోజు ఇరువురూ భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశం మొత్తం ఆసక్తికర పరిణామాలతో సాగింది. ముందుగా, ఇద్దరు భేటీ అవుతున్నారు అంటే, ఎవరైనా రాష్ట్ర సమస్యల పై అనుకుంటారు. అయితే రాష్ట్ర సమస్యలు అయితే, అధికారులు కచ్చితంగా ఉండే వారు. అయితే, ఇప్పుడు వీరి భేటీలో అధికారులు లేరు. అంటే, ఇక్కడ వీళ్ళు రాష్ట్ర సమస్యలు కంటే, రాజకీయమే ఎక్కువ మాట్లాడుకున్నారని అర్ధమవుతుంది. గతంలో భేటీల్లో అధికారులు పాల్గున్న సంగతి తెలిసిందే.

kcr 13012020 1

ఇక మరో అంశం, ఈ భేటీ దాదాపుగా ఆరు గంటలు సాగింది. ఇది గతంలో భేటీల కంటే సుదీర్హంగా జరిగినట్టు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మూడు రాజధానులతో జగన్ బోల్తా పడటంతో, ఆ విషయంలో ఎలా బయటకు రావాలో కేసీఆర్ చెప్పి ఉంటారని, అలాగే ఇద్దరు కలిసి బీజేపీతో ఎలా పోరాడాలో కలిసి మాట్లాడుకుని ఉంటారని తెలుస్తుంది. ఇక మరో అంశం, జగన్ రాగానే, కేసీఆర్, కేటీఆర్ వచ్చి స్వాగతం చెప్పిన సమయంలో, జగన్ పక్కనే విజయసాయి రెడ్డి ఉన్నారు. లోపలకి రాగానే, విజయసాయి రెడ్డి, కేసీఆర్ కళ్ళకి మొక్కారు. ఇలా ఎందుకు చేసారో ఎవరికీ అర్ధం కాలేదు. పోనీ ఇద్దరికీ పెద్ద వయసు తేడా ఉందా అంటే, రెండు - మూడేళ్ళు తేడా కూడా లేదు. మరి విజయసాయి రెడ్డి అంత స్వామి భక్తి ఎందుకు చూపించారో ?

kcr 13012020 1

అలాగే, మరో అంశం, కేటీఆర్ తనయుడు హిమాన్షు, జగన్ ను కలిసి కొంచెం సేపు మాట్లాడారు. ఇద్దరూ కలిసి ఫోటోలు దిగారు. జగన్, మంత్రి కేటీఆర్ ఇద్దరూ ఒకే తరహా ఫాంట్, షర్టు వేసుకోవటంతో కెమెరాలు ఒక్కసారిగా క్లిక్ మన్నాయి. ఆరు గంటల పాటు సాగిన ఈ భేటీ గురించి, ఎవరూ ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడలేదు. కొద్ది సేపటిలో సిఎంఓ ప్రెస్ నోట్ ఇచ్చే అవకాసం ఉంది. మరో పక్క, ఈ భేటీ పై, టిడిపి స్పందించింది. జగన్‌, కేసీఆర్‌లు ఇప్పటివరకు 6 సార్లు భేటీ అయ్యారని, ఇప్పటి వరకు, అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయిని, రెండురాష్ట్రాలమధ్య రూ.లక్షా97వేలకోట్ల ఆస్తుల పంపకాలు పెండింగ్ లో ఉన్నాయని, షెడ్యూల్‌ 9, 10 కింద అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయని, ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌ ఆస్తులకి సంబంధించి రూ.5,500కోట్లు పంపకాలు జరగాల్సి ఉందని, ఏపీజెన్‌కోకు తెలంగాణ డిస్కంలనుంచి రూ.5,700కోట్లు రావాల్సిఉందని, వేలాదిఉద్యోగుల సమస్య అలానే ఉందని, వీటి పై ఏమి చేసారు అంటూ టిడిపి ప్రశ్నించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read