ఈ రోజు హైదరాబాద్ లోని హైటెక్స్ లో, టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ ని మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణా గురించి, తన పార్టీ గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఇక్కడ వరకు బాగానే కేసీఆర్, ఏపి పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఏపి పరిస్థితి రోజు రోజుకీ దిగజారి పోతూ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో చంద్రబాబును చూసి వచ్చిన కంపెనీలు ఇప్పుడు తెలంగాణాకు వెళ్ళిపోతున్నాయి. అలాగే ఏపిలో ఉన్న రియల్ ఎస్టేట్ మొత్తం తెలంగాణాకు వెళ్ళిపోతుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఏపిలోని అసమర్ధ ప్రభుత్వం వల్ల, ఏపిని నష్టం జరుగుతుంటే, తెలంగాణాకు లాభం జరుగుతుంది. ఈ రోజు కేసీఆర్ మాట్లాడుతూ, ఏపి తలసరి ఆదాయం గురించి, విద్యుత్ రంగం గురించి, పోలిక పెడుతూ, ఏపి ఎంత తక్కువగా ఉందో చూపించే ప్రయత్నం చేసారు. ఆయన మాట్లాడుతూ " తెలంగాణ అన్నపూర్ణగా అవతరించిందని అన్నారు. ఏ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మనం విడిపోయామో, ఈ రోజు ఆ ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటా ఇన్కం, లక్షా 70 వేల కోట్లు ఉంటే, తెలంగాణా పర్ క్యాపిటా ఇన్కం, రెండు లక్షలా 30 వేల కోట్లు."

kcr 25102021 2

"ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ తెలంగాణాతో పోల్చుకుంటే. ఏ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న సమైఖ్య ముఖ్యమంత్రి, ఎవరు అయితే మీకు చీకటి అయిపోతుంది, కరెంటు రాదు అని చెప్పారో, ఆ ఆంధ్రప్రదేశ్ లో కరెంటు లేక చీకట్లు ఉంటే, తెలంగాణాలో మాత్రం 24 గంటలు వెలుగులు ఉన్నాయి. ఇవి వాస్తవాలు" అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేసిఆర్ వ్యాఖ్యలు విని ఆంధ్రులు బాధ పడుతున్నారు. 2014-2019 మధ్య గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాలతో పోటీ పడిన ఆంధ్రప్రదేశ్, నేడు తెలంగాణా చేతిలో కూడా చీత్కారాలు పడాల్సి వస్తుంది అంటూ వాపోతున్నారు. గతంలో కూడా హరీష్ రావు, కేటీఆర్ ఇలాగే ఏపి గురించి మాట్లాడారు. మరి ఈ వ్యాఖ్యల పై జగన్ మోహన్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారో చూడాలి. అనవసరమైన విషయాల పై రచ్చ చేసే వైసిపీ నేతలు ఇప్పుడు ఏమి స్పందిస్తారో చూడాలి. ఏపిలో కరెంటు కోతలు అంటే కేసులు పెడతాం అని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పై కౌంటర్ ఇస్తుందో లేదో మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read