అంతా అనుకున్నట్టే జరుగుతుంది. జగన్ మోహన్ రెడ్డి గారు గెలిచిన కొత్తలో, గోదావరి నీటిని, తెలంగాణా భూభాగం నుంచి తీసుకుని వెళ్లి శ్రీశైలంలో కలుపుతాం, కేసీఆర్ ఈజ్ మ్యగ్నానమస్ అంటూ, అసెంబ్లీలో పొగడ్తల వర్షం కురిపించారు. కేసిఆర్ పెద్ద మనుసుతో ముందుకు వస్తే, చంద్రబాబు కుళ్ళి పోతున్నారు అంటూ చెప్పారు. అప్పట్లోనే అసెంబ్లీలో చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. ఇది మీ ఇద్దరి స్నేహం విషయం కాదు, రాష్ట్రము విషయం, రేపు మీ ఇద్దరికీ స్నేహం చెడితే, ఎవరు బాధ్యత వహిస్తారు ? మన ఇబ్బందులు మనమే పడదాం అని. ఇప్పుడు సరిగ్గా ఈ మాటలు గుర్తు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అంతే కాకుండా, రాయలసీమకు నష్టం కలిగించే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కు వెళ్ళారు. అయితే ఈ రోజు కేసీఆర్ మాట్లాడిన మాటలు చూస్తుంటే, మళ్ళీ ఆయన ఏపి పై కాళ్ళు దువ్వుతున్నారు. ఏ నోటితో అయితే, రాయలసీమను రత్నాల సీమ చేస్తాను అన్నారో, ఇప్పుడు ఏపి నోరు మూయిస్తాను అంటున్నారు. ఈ రోజు తెలంగాణాలో, నీటి పారుదలశాఖ పై, కేసిఆర్ సమీక్ష చేస్తూ, ఏపి పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. నీటి ప్రాజెక్టుల విషయంలో, అటు కేంద్రం, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీరు సరిగ్గా లేదు అని అన్నారు.

తెలంగాణాలో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ పై, ఆంధ్రప్రదేశ్ అర్ధం లేని నిరాధార ఆరోపణలు చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంభిస్తోందని అన్నారు వీటి అన్నిటి పై, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సమర్థంగా వాదనలు వినిపిస్తామని అన్నారు. నేను ఏపి ప్రభుత్వ పెద్దలను పిలిచి, భోజనం పెట్టి, ఇరు రాష్ట్రాల రైతులకు ఉపయోగపడేలా ప్రణాళిక రచించి, బేసిన్లు, భేషజాలు లేవని చెప్తే, ఇప్పుడు ఏపి ప్రభుత్వం, కెలికి కయ్యం పెట్టుకుంటుందని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు సెహ్సారు. అన్ని వివరాలతో, సమగ్రంగా కౌంటర్ ఇచ్చి, అపెక్స్ కమిటీ భేటీలో ఏపీ నోరు మూయించేలా, అర్ధం పర్ధం లేని వాదనలకు సమాధానం చెప్తాం అని అన్నారు. మరి ఈ వైఖరి పై జగన్ గారు ఏమి అంటారో ? కేవలం పోతిరెడ్డిపాడు వెడల్పు అంటేనే, అదీ గట్టిగా మహా అయితే వరద వచ్చే సమయంలో, వచ్చే 5 నుంచి 10 టిఎంసి నీటి కోసం, ఈ గొడవ ఏమిటో. ఇదేదో పెద్ద ప్రాజెక్ట్ లాగా, ఇరు రాష్ట్రాల మధ్య ఈ సమస్య నిజంగా వచ్చిందా, లేక ఇరు రాష్ట్రాల పెద్దలు ఉన్న సమస్యల నుంచి డైవర్ట్ చెయ్యటానికా, అనేది చూడాలి

Advertisements

Advertisements

Latest Articles

Most Read