జగన్ మోహన్ రెడ్డి, కేసిఆర్ మధ్య స్నేహం అందరికీ తెలిసిందే. పోయిన సార్వత్రిక ఎన్నికల్లో, జగన్ గెలుపు కోసం, కేసీఆర్ అన్ని రకాల సహాయాలు చేసారనే పేరు కూడా ఉంది. ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డి వచ్చిన కొత్తలో, జగన్, కేసీఆర్ తెగ కులుసుకునే వారు. కలిసిన ప్రతి సారి, ఏపికి ఏది వచ్చేది కాదు కానీ, తెలంగాణాకు మాత్రం ఏదో ఒక లాభం చేకురేలా నిర్ణయాలు వచ్చాయి. ఏమైందో ఏమో కానీ, గత ఏడాది, ఏడాదిన్నర కాలంగా, జగన్, కేసీఆర్ కలుసుకుంది లేదు. ముఖ్యంగా ఏపి చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల విషయంలో, కేసిఆర్ గరంగరంగా ఉన్నారు. రెండు రాష్ట్రాలు కేసులు కూడా వేసుకున్నాయి. అయితే ఇప్పుడు కేసీఆర్, జగన్ ను కాదని, కర్నాటక ముఖ్యమంత్రి యాడ్యురప్పను కలవాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఆర్డీఎస్ విషయంలో కేసీఆర్ అభ్యంతరం చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తుంగభద్ర మీద ఉండి, తెలంగాణా, ఆంధ్ర, కర్ణాటక వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది. అయితే తెలంగాణాకు రావాల్సిన నీటి వాటా రాకపోగా, ఆర్డీఎస్ కి సమాంతరంగా మరో కాలువ తవ్వటం కోసం ఏపి తీసుకున్న నిర్ణయం పై కేసిఆర్ ఆగ్రహంగా ఉన్నారు. అందుకే యాడ్యురప్పను కలిసి, జగన్ చేస్తున్న పనులకు బ్రేక్ వేయాలని చూస్తున్నారు. మరి పక్క రాష్ట్రాలు పేచీలు పెడితే, జగన్ మోహన్ రెడ్డి, దీన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read