సీఎం చంద్రబాబును ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఏపీ రాజధాని అమరావతిలో కలిశారు. బీజేపీయేతర కూటమి, తాజా రాజకీయ పరిస్థితులపై రెండున్నర గంటలపాటు చర్చించారు. తొలిసారిగా అమరావతికి సీఎం కేజ్రీవాల్‌‌కు రావడంతో ఆయనకు టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అంతకుముందు గన్నవరం ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నకేజ్రీవాల్‌ను మంత్రులు నారా లోకేశ్, దేవినేని ఉమ, కలిశారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని కేజ్రీవాల్‌కు వివరించారు. కాగా సీఎం చంద్రబాబు... కేజ్రీవాల్ ఇటీవల చేపట్టిన దీక్షకు మద్దుతు తెలిపారు. అంతేకాదు ఢిల్లీకి వెళ్లి కేజ్రీవాల్ దీక్షలో కూడా పాల్గొన్నారు. రాత్రి బాగా పొద్దు పోయేంత వరకు వీరి మధ్య చర్చలు కొనసాగాయి. దేశ రాజకీయాలు, జాతీయ స్థాయిలో భాజపాయేతర పార్టీలతో ప్రత్యామ్నాయ కూటమిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన కార్యాచరణ, తదితర అంశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు.

kejriwal 19022019

భాజపాయేతర పార్టీల మధ్య ముందస్తు ఎన్నికల అవగాహన, అది కుదరని చోట ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీ ఎలా ఉండాలి? ఎన్నికల అనంతర పొత్తులకు ఒక ప్రాతిపదిక సిద్ధం చేయడం వంటి అంశాలపై వీరు ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. ఈ నెల 26 లేదా 27వ తేదీల్లో దిల్లీలో భాజపాయేతర పార్టీ నాయకులంతా మరోసారి భేటీ కానున్నారని, ఆ అంశంపై ముఖ్యమంత్రులిద్దరూ చర్చించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. జాతీయ స్థాయిలో భాజపాయేతర కూటమిలో కాంగ్రెస్‌, ఆప్‌ కూడా కీలకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దిల్లీలో ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ అవగాహన ఏ విధంగా ఉండాలి? వంటి అంశాలపైనా చంద్రబాబుతో కేజ్రీవాల్‌ చర్చించినట్టు తెలిసింది.

kejriwal 19022019

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పట్ల మోదీ అనుసరిస్తున్న వైఖరిపై కూడా వీరు చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ యేతర పార్టీలతో ఏర్పాటు అవుతున్న కూటమిని బలహీన పరిచేందుకు మోదీ అనుసరిస్తున్న కుట్రలను ఛేదించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించారు. ఎన్నికలకు ముందు పొత్తు, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై కూడా వీరిద్దరు చర్చించారు. విజయవాడ వచ్చే ముందు కేజ్రీవాల్ పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామిని కలిసి సంఘీభావం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా, పోలింగ్‌కు ముందుగా మార్చిలో అమరావతిలో ధర్మపోరాట దీక్ష నిర్వహించేందుకు సూత్రప్రాయంగా ప్రతిపాదించారు. సహకరించని పార్టీల నేతలపై సీబీఐ దాడులతో బెదిరింపులు, తదితర అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. కూటమిలో కొన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌ను కలుపుకోవడంపై విభేదిస్తున్న నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన కార్యాచరణ రూపకల్పన చేసేందుకు ప్రతిపాదించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, దేశాన్ని కాపాడేందుకు కొంత సర్దుబాటు తప్పదన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read