దేశ వ్యాప్త లాక్ అవుట్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే, హైదరాబద్ లో ఉన్న హాస్టల్స్ అన్నీ నిన్న ఖాళీ చెయ్యాలి అని చెప్పటంతో, వేలాది మంది రోడ్డున పడ్డారు. పోలీస్ దగ్గర NOC తీసుకుని, తమ ఊరికి బయలు దేరారు. నిన్న ఏపి బొర్డర్ లో జరిగిన రచ్చ చూసాం. అటు తెలంగాణా పంపించటంతో , ఇటు వచ్చిన వారిని దాదాపుగా 7 గంటలు పాటు రోడ్డు మీద నిలబెట్టారు. మహిళలు కూడా అర్ధరాత్రి దాకా రోడ్డు మీద ఉన్నారు. అయితే, ఇప్పుడు మీరు వినేది దీనికి భిన్నం. హైదరాబాద్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పని చేస్తున్న, 14 మంది మహిళా ఉద్యోగులు మంగళవారం ఉదయం టెంపో ట్రావెలర్‌లో, కేరళలోని తమ ఇంటికి ప్రయాణం అయ్యారు. డ్రైవర్ తప్ప మిగతా వారంతా అమ్మాయిలే. కారు కోజికోడ్‌కు వెళుతోంది.

కానీ అర్థరాత్రి లాక్డౌన్ ప్రకటించడంతో, వారికి ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. కేరళ బొర్డర్ లో చిక్కుకున్నారు. దీంతో, సరిహద్దు వద్ద మిమ్మల్ని దించేస్తానాని, ఇక్కడ నుంచి తమ స్థలానికి క్యాబ్ తీసుకెళ్లాల్సి ఉంటుందని డ్రైవర్ చెప్పాడు. అర్ధరాత్రి వేళ, వారికి ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. దేంతో వారు చాలా మంది ఉన్నతాధికారులకు కాల్ చేసారు, కాని ఎవరూ స్పందించలేదు. అప్పటికి, సమయం గడిచిపోయింది. ఇక వేరే మార్గం లేక, వారిలో ఒకరు ముఖ్యమంత్రి ఆఫీస్ కు సహాయం కోసం ఫోన్ చేసారు. అయితే అనూహ్యంగా, ఏకంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గొంతు వినిపించింది. ఆయనే స్వయంగా ఫోన్ ఎత్తారు.

జరిగిన విషయం వారికి చెప్పారు. హైదరాబాద్ నుంచి వస్తున్నాం అని, కేరళ బొర్డర్ లో చిక్కుకున్నాం అని, సహాయం చెయ్యమని కోరగా, ఆయన స్పందించారు. వెంటనే, వయనాడ్ కలెక్టర్ మరియు ఎస్పీకి ఫోన్ చెయ్యమని, వారికి అవసరమైన దిశానిర్దేశం చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్, ఎస్పీల మొబైల్ నంబర్‌ను కూడా సీఎం తెలియజేశారు. ఎస్పీ నుంచి మొదట ఫోన్ వచ్చింది వచ్చింది. ఆయన వేరే వాహనం ఏర్పాటు చేసి, వారికి తగు వైద్య పరీక్షలు జరిపి, వారిని ఇంట్లో దిగబెట్టారు. ఏకంగా సియం ఫోన్ ఎత్తటం, వారి సమస్య పరిష్కారం చెయ్యటంతో, సియం అంటే ఇలా ఉండాలి అంటూ, ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read