టిడిపికి చెందిన విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని అధిష్టానంతో అంటీముట్ట‌న‌ట్టు చేస్తున్న వ్య‌వ‌హారాలు బ్లూ మీడియాకి హాట్ టాపిక్ అయ్యాయి. ఇక కేశినేని నాని వైసీపీ నేత‌ల‌ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. ఈ హ‌ఠాత్ప‌రిణామానికి కార‌ణాలేంట‌ని విశ్లేషిస్తే, 2019లో టిడిపి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్న‌ప్పుడు ఎంపీగా గెలిచాన‌ని, పార్ల‌మెంటు ప‌రిధిలోనూ టిడిపి అసెంబ్లీ అభ్య‌ర్థులంతా ఓడిపోయినా విజ‌యం సాధించ‌డం త‌న చ‌రిష్మా అని కేశినేని నాని గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. త‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్‌తోనే గెలుస్తాన‌నే ప్ర‌గాఢ విశ్వాసంలో ఉన్నారు నాని. విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి కోసం ముళ్ళ పందితో అయినా కలుస్తానంటూ చేసిన వ్యాఖ్యలు క‌ల‌క‌లం రేపాయి. అక్క‌డితో ఆగ‌కుండా తనకు ఎంపీ టికెట్ లేకపోతే కేశినేని భవన్ లో కూర్చొని విజయవాడ ప్రజలకు సేవ చేస్తానన‌డం ఏదో పెద్ద వ్యూహ‌మేనంటున్నారు. నందిగామ వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావుని ప్ర‌శంసిస్తే త‌ప్పేంట‌ని ఎదురు ప్ర‌శ్నించ‌డం, త‌న ఎంపీ నిధుల‌ని వాడుకుని నందిగామ‌, జ‌గ్గ‌య్య‌పేట వైసీపీ ఎమ్మెల్యేలు బాగా అభివృద్ధి చేస్తున్నార‌ని కితాబిచ్చారు. ఈ ప్ర‌శంస‌ల వెనుక రాజకీయం ఏంటో మరి. మ‌రోవైపు నాని త‌మ్ముడు చిన్ని పార్ల‌మెంటు టిడిపి టికెట్ ఆశిస్తూ దూసుకుపోతున్నారు. ఓవైపు టిడిపి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జిలు అంద‌రినీ త‌న వైపు తిప్పుకున్నారు. అధిష్టానంతో స‌త్సంబంధాలు మెయింటెన్ చేస్తున్నారు. మ‌రోవైపు పార్ల‌మెంటు పరిధిలో కేశినేని ఫౌండేష‌న్ కార్య‌క్ర‌మాలు విస్తృతం చేశారు. అయితే కేశినేని నాని చేస్తున్న ప్రకటనలతో మాత్రం, బెజవాడ టిడిపి శ్రేణులు అయోమయంలో పడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read