తెలుగుదేశం పార్టీ, విజయవాడ ఎంపీ కేశినేని నాని, గత మూడు రోజులుగా, సొంత పార్టీ నేత పై ట్విట్టర్ వార్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు మాత్రం, వైసీపీ నేత పిటీషన్ తో వార్తల్లోకి ఎక్కారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్ధిగా వైసిపీ నుంచి పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ అలియాస్ పివిపి, కేశినేని నాని పై, వంద కోట్ల రూపాయాలకు పరువు నష్టం దావా వేసారు. దీంతో బెజవాడ రాజకీయం మళ్ళీ హీటెక్కింది. ఇప్పటికే కేశినేని, బుద్దా పై జరుగుతున్న ట్విట్టర్ వార్ తో, వార్తల్లోకి ఎక్కిన బెజవాడ రాజకీయం, ఇప్పుడు పీవీపీ ఎంట్రీతో, మరింత హాట్ గా మారింది. కేశినేని నాని పై వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశానని, దీనికి సంబంధించి లీగల్ నోటీసులు కేశినేని నానికి పంపానని, వైసిపీ నేత పీవీపీ చెప్పారు. దీనికి సంబంధించి, లీగాల్ నోటీసులను, ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

మొన్న జరిగిన ఎన్నికల ప్రచారంలో, తనను నేరస్తుడని, కేశినేని సంభోదించారని, ఆ విషమై, లీగల్ నోటీసులు పంపించినట్టు పీవీపీ తెలిపారు. తన పై ఎక్కడా కేసులు లేవని, అయినా తనను కేశినేని నాని నేరస్థుడు అంటున్నారని, ఆరోపించారు. పనామా పేపర్స్ లో తన పేరు ఉందని కేశినేని అన్నారని, అవి నిరూపించాలని, లేకపోతె లీగాల్ నోటీసులను ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. ఈ విషయం పై ట్విట్టర్ లో పెడుతూ, నాని ఉద్దేశిస్తూ, మొన్న ఎవరో షో మాస్టర్ లు, టాస్క్ మాస్టర్ లు అన్నారు, టాస్క్ మాస్టర్ ఎలా ఉంటాడో చిన్న శాంపిల్ అంటూ లీగల్ నోటీసులు జత చేసారు. దీని పై నాని ట్విట్టర్ లో స్పందిస్తూ, ఈ ఉడత ఊపులు చిన్నప్పుడే చూసాను అంటూ, పీవీపీ ఇంత బారు రాసిన లీగల్ నోటీస్ ను, ఒక్క మాటతో తీసి అవతల పడేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read