రేపు అనంతపురం జిల్లాలో, ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకోనుంది. చంద్రబాబు డ్రీం ప్రాజెక్ట్ ని, అలాగే ప్రతిపక్షంలో ఉన్నంత వరకు, వ్యతిరేకించిన ప్రాజెక్ట్ ని, రేపు జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. రేపు అనంతపురం జిల్లాలో, కియా మోటార్స్ కంపెనీ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి జగన్ మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా, ఏర్పాట్ల పై, కలెక్టర్ తో పాటుగా, పోలీసులు కూడా సమీక్ష చేసారు. ఈ సమీక్షలో, కియా కంపెనీ లీగల్ హెడ్ జుడ్ కూడా పాల్గున్నారు. రేపు జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ప్లాంట్ టూర్, ఓపెనింగ్ సెర్మనీ కార్యక్రమాలు ఉంటాయని చెప్తున్నారు. రేపు జగన్ మోహన్ రెడ్డి, గన్నవరం విమానాశ్రయం నుంచి, పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకొని, అక్కడ నుంచి కియా కంపెనీలో జరిగే కార్యక్రమనాకి, హాజరు అవుతారని, తగిన ఏర్పాట్లు, భద్రత చెయ్యాలని, కలెక్టర్, అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. అయితే, ఇదంతా బాగానే ఉన్నా, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కియా పర్యటన పై, అందరూ అవాక్కవుతున్నారు.

kia 04122019 2

గతంలో మూడు నెలల క్రిందట, కియా కంపెనీలో, మొదటి చారు లాంఛింగ్ కార్యక్రమానికి జగన్ హాజరు కావాల్సి ఉండగా, అప్పుడు ఆయన ఆ కార్యక్రమానికి, రావటం కుదరటం లేదు. అప్పట్లో, ఇది పెద్ద దుమారానికి దారి తీసింది. అయితే ఇప్పుడు మళ్ళీ, రేపు కియా కంపెనీ లాంచింగ్ ఏంటి అంటూ, అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఇప్పటికే కంపెనీ లాంచ్ అయ్యిందని, మొదటి కారు కూడా, వైసీపీ నేతల సారధ్యంలోనే లాంచ్ అయ్యిందని, ఇప్పటికే 15 వేల కార్లు దాకా బయటకు వెళ్లాయని, అలాగే కొన్ని చోట్ల అయితే, అప్పుడే ఈ కార్లు సెకండ్ హ్యాండ్ లో కూడా దొరుకుతున్నాయని, ఇలాంటి సమయంలో, జగన్ మోహన్ రెడ్డి, వచ్చి, లాంచింగ్ చెయ్యటం ఏంటో, అంటూ, అందరూ ఆశ్చర్యపోతున్నారు.

kia 04122019 3

కియా ప్లాంట్ కష్టం అంతా చంద్రబాబుది అని అందరికీ తెలిసిందే. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ లను కాదని, మన రాష్ట్రానికి కియా కంపెనీ రావటంలో, చంద్రబాబు కృషి ఎంతో ఉంది. అయితే, కియా కంపెనీ నుంచి, చంద్రబాబుని చరిపేసే దిశగా, వైసీపీ అడుగులు వేసింది. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే, ఈ క్రెడిట్ అంతా దివంగత వైఎస్ఆర్ ది అంటూ, ఆర్ధిక మంత్రి బుగ్గన ఒక ఉత్తరం చదివిన సంగతి తెలిసిందే. 2007లో వైఎస్ఆర్, అప్పటి కియా కంపెనీని పెట్టుబడులు పెట్టమని కోరారని, అందుకే మేము ఆంధ్రప్రదేశ్ లో పెట్టమంటూ, కియా కంపెనీ లేఖ రాసినట్టు అసెంబ్లీ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇలా కియా నుంచి చంద్రబాబు గుర్తులు చెరిపేసే పనిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. అయితే ప్రతిపక్షంలో ఉండగా, కియాను వ్యతిరేకించిన జగన్, రేపు ఆ కంపెనీ లాంచింగ్ కు వెళ్తున్నారు అంటే, ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్ ఏమో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read