మాజీ ముఖ్యమంత్రి, జై సమైఖ్యాంధ్ర పార్టీ అధినేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాజకీయాల్లోకి రీ ఎంట్రీ చేయనున్నారు అనే వార్తలు నేపధ్యంలో, దాదాపు నాలుగేళ్ల తరువాత కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లడారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని అంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు ఆయన్ను ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఊమెన్ చాందీ ఈరోజు హైదరాబాదులోని కిరణ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఏపీకి చెందిన పలువురు నేతలు కూడా హాజరయ్యారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని ఇటీవల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

kiran 01072018 2

భేటీ అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ లో చేరుతున్నాననేవి కేవలం వార్తలు మాత్రమేనని... సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతానని తెలిపారు. ఊమెన్ చాందీ మాట్లాడుతూ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకే కాకుండా, యావత్ దేశానికే కీలక సమయమని చెప్పారు. విభేదాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ దేశం కోసం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. కాంగ్రెస్ ను వీడిన నేతలందరినీ మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డిని కూడా పార్టీలోకి ఆహ్వానించామని... తుది నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం ఆయనే అని తెలిపారు.

kiran 01072018 3

మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సొంతగూటికి చేరుతారన్న ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే కిరణ్‌కుమార్‌రెడ్డిని కొందరు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కలిసి తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఆదివారం ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఉమెన్‌చాందీ, కిరణ్‌కుమార్‌రెడ్డి ఆసక్తి రేపుతుంది. ఈనెల 3న గానీ, 4న గానీ ఢిల్లీలో కాంగ్రెష్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కిరణ్‌ పార్టీలో చేరతారని సమాచారం. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి.. సొంతంగా పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో ఘోర పరాజయం పొందారు. ఇన్నాళ్లు ఇంటికే పరిమితం అయిన ఆయన ఇప్పుడు మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్‌ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read