ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో, నీతి ఆయోగ్ స‌మావేశంలో పాల్గొనేందుకు జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ స‌మావేశానికి కంటే ముందే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను, జగన్ కలిసారు. జగన్ మొదటి ప్రెస్ మీట్ లో చెప్పినట్టు, ఈ దేశంలోనే టాప్ 2 పవర్ఫుల్ మ్యాన్ అయిన అమిత్ షా ను కలిసి, సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అని అడుగుతానని చెప్పినట్టే, అడిగారు. ఎన్నిసార్లు ఢిల్లీ వస్తే అన్నిసార్లు హోదా గురించి ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతానే ఉంటామని జగన్ చెప్పిన విషయం తెలిసిందే. అమిత్ షా ను కలిసిన సందర్భంలో కూడా, జగన్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మనసు కరిగించండి అని అమిత్ షాను కోరినట్టు జగన్ చెప్పారు. మీరు ఈ మంచి మాట, మోడీతో చెప్పండి అని చెప్పినట్టు జగన్ చెప్పుకొచ్చారు. అయితే, ఈ రోజు ఇదే విషయం పై జగన్ కు క్లారిటీ ఇచ్చారు హోం మినిస్టరీ సహాయ మంత్రి.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. అమిత్ షా హోం మంత్రి అయితే, కిషన్ రెడ్డి హోంశాఖ సహాయ మంత్రి అన్న విషయం అందరికీ తెలిసిందే. నిన్న జగన్ మాట్లాడిన విషయం పై హోం శాఖ తరుపున క్లారిటీ ఇచ్చారు. ప్రత్యెక హోదా ముగిసిన చరిత్ర అని, కాని విభజన హామీల పరిష్కారానికి నావంతు కృషి చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విభజన సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. మొత్తానికి జగన్ ప్లీజ్ సార్ ప్లీజ్ అంటున్నా, కేంద్రం ఎక్కడా కనికరం చూపుతున్నట్టు కనిపించటం లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read