ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో తాను టీడీపీలో చేరుతున్నట్లు మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఇక్కడ అశోక్‌బంగ్లాలో ఎంపీ అశోక్‌గజపతిరాజును కలిశారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని, అందుకోసం టీడీపీయే సరైనదని భావించి ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. గతంలో తాను టీడీపీ సహకారంతో గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పరిస్థితి దిగజారిందని, టీడీపీ బలంగా ఉందని అన్నారు. కాగా, ప్రధాని మోదీ, అమిత్‌షాలు లౌకికవాదాన్ని పక్కన పెట్టి సామ్యవాద సిద్ధాంతాలతో పరిపాలన చేస్తున్నారని విమర్శించారు.

kishore 19022019 1

అందువల్లనే బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో ప్రాంతీయ పార్టీలు కీలక భూమిక పోషిస్తున్నాయన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇస్తామని చెబుతున్నారని, ఈ దఫా చంద్రబాబునాయుడు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెప్పిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. కాగా, ఒకే ఇంట్లో తండ్రి ఒక పార్టీలోను, కుమార్తె మరో పార్టీలో ఉండటాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా తన కుమార్తె శృతి ఆలోచనలను నియంత్రించడం సరికాదని బదులిచ్చారు. కాగా, ఎంపీ అశోక్‌గజపతిరాజుతో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందని, ఆయనతో కలసి పనిచేసే అవకాశం లభించడం తనకు ఆనందంగా ఉందని అన్నారు.

kishore 19022019 1

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో భాజపాను, రాష్ట్రంలో వారికి సహకరిస్తున్న పార్టీల్ని ఇంటికి పంపాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 24వ తేదీన అమరావతిలో తెదేపాలో చేరుతున్నట్లుగా తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తన కుమార్తె శృతీదేవి కాంగ్రెస్‌లో కొనసాగడంపై ప్రశ్నించినప్పుడు ఆమె స్వయంగా నిర్ణయాలు తీసుకోగలిగిన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. తన కుమార్తె శ్రుతీదేవి ఆమెకు నచ్చిన పార్టీలో ఉన్నారని, రాజకీయంగా ఆమెతో ఎటువంటి సంబంధం లేదన్నారు. ఎంపీ టికెట్‌ ఆశించి టీడీపీలో చేరుతున్నారా అని అడుగగా.. టికెట్లు ఆశించి రావడం లేదని.. కేంద్రాన్ని ఢీకొట్టే పార్టీ టీడీపీ ఒక్కటేనని భావించి వచ్చానని బదులిచ్చారు. అశోక్‌గజపతిరాజు, తాను స్నేహపూరిత వాతావరణంలో పనిచేస్తామన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read