మంత్రి కొడాలి నాని భాష, వేషం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా బాగా ఫేమస్. ఆయన నోరు తెరిస్తే అంతే సంగతులు. బూతులే బూతులు. ఇక ఈ బూతులు ఎంత వరకు అంటే, చెప్పే పనే లేదు. అమ్మా మొగుడుతో మొదలు పెట్టి, ఎక్కడి వరకు వెళ్తాయో ఆయనకే తెలియదు. ఇక చంద్రబాబు గారిని అయితే, ఆయన తిట్టే బూతులు అన్నీ ఇన్నీ కావు. క-రో-నా లాక్ డౌన్ సమయంలో చంద్రబాబు గారు వయసు దృశ్యా ఇంట్లో ఉంటే, ముసలోడివి, కొంపలో ఉంటావు, పోతావ్, హైదరాబాద్ లో ఉంటావు, ఇలా అనేక మాటలు మాట్లాడారు. మరీ ముఖ్యంగా మనవడి కోసం, చంద్రబాబు హైదరాబాద్ ప్రతి వీకెండ్ హైదరాబాద్ వెళ్తే దాన్ని కూడా హేళన చేస్తూ ఉంటారు. పక్క రాష్ట్రం వాడు, హైదరాబద్ వాడు అంటూ హేళన చేస్తూ ఉంటారు. అయితే విధి ఎవరినీ వదలదు కదా ? అందరి దూల తీర్చేస్తుంది. అలాగే ఇప్పుడు కొడాలి నానికి కరోనా వచ్చింది. ఇందులో తప్పు ఏమి లేదు. బయట తిరిగే అందరికీ వస్తుంది కాబట్టి. కానీ ఆయన వెళ్లి హైదరాబాద్ ఏఐజిలో చేరటమే హైలైట్. చంద్రబాబుని హైదరాబాద్ వాడు అని చెప్పిన కొడాలి నాని, అదే హైదరాబాద్ హాస్పిటల్ కు పరిగెత్తారు. ఇక్క ఏపిలో జగన్ అద్భుతంగా హాస్పిటల్స్ మైంటైన్ చేస్తున్నాడని చెప్పి, మరి హైదరాబాద్ ఎందుకు వెళ్ళావ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పడుతున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read