మాజీ స్పీకర్, మజీ మంత్రి అయిన కోడెల శివ ప్రసాద్ చనిపోవటానికి, గత మూడు నెలలుగా జగన్ ప్రభుత్వం, వెంటాడి, వేటాడి, కోడెలను మానసిక క్షోభకు గురి చెయ్యటమే కారణం అని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, టిడిపి పార్టీ కార్యకర్తలకు, కోడెల అభిమనులకు కోపం తెప్పించేలా చేసింది. ఒక పక్క వేధిస్తూనే, మరో పక్క కోడెల అంత్యక్రియలకు, ప్రభుత్వ లాంఛనాలతో జరిపించాలని జగన్ ఆదేశించటం వీరి ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. ఈ రోజు కొంత మంది రెవిన్యూ, పోలీస్ అధికారులు, కోడెల ఇంటికి వచ్చి, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చెయ్యమని జగన్ ఆదేశించారని చెప్పారు. అయితే, వారు తీవ్ర ఆవేదనకు గురై, ఆ అధికారులకు దండం పెట్టి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని, మీ ప్రభుత్వం వద్దు మీరు వద్దు, అభిమానులు, కార్యకర్తల మధ్య ఆయనకు కడసారి వీడ్కోలు పలుకుతాం అని అన్నారు.

kodela 18092019 2

అయితే చంద్రబాబు వచ్చిన వెంటనే, ఈ విషయం పై ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాసం ఉంది. ఒక పక్క అంతిమయాత్రలో 144 సెక్షన్ పెడుతూ, ఇప్పుడు అధికార లాంచనాలా అంటూ, నిన్న చంద్రబాబు ఫైర్ అయిన తరువాత, నిన్న 144 సెక్షన్ ఎత్తేస్తున్నాం అని పోలీసులు ప్రకటించారు. అయితే, ఇప్పుడు అధికార లాంఛనాలతో చేస్తారా లేదా అనేది చంద్రబాబు నిర్ణయం పై ఆధార పడి ఉంటుంది. కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని చంద్రబాబు ఒప్పుకుంటారా, లేక కోడెలకు సరైన గౌరవం ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వ లాంచనాలతో చెయ్యాలని, కుటుంబ సభ్యులను ఒప్పిస్తారా అనేది చూడాలి. అయితే అక్కడ కుటుంబ సభ్యులు, అభిమానులు మాత్రం, ఈ ప్రభుత్వమే హత్య చేసి, ఇప్పుడు ఇలా వద్దు అని అంటున్నారు.

kodela 18092019 3

అంతకుముందు, అభిమానుల సందర్శనార్థం హైదరాబాద్‌లోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో కోడెల పార్థివదేహాన్ని ఉంచారు. మంగళవారం ఉదయం అక్కడ నుంచి అంబులెన్సులో గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. నిన్న అంతా జోరు వాన కురుస్తున్నా, లెక్క చేయకుండా అంబులెన్స్‌ వెళ్లే దారిపొడవునా ప్రతి ఊరిలో ఆయనకు నివాళులు అర్పించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా కోడెల పార్థివదేహంతో కలిసి హైదరాబాద్‌ నుంచి గుంటూరు పార్టీ ఆఫీస్ వరకూ వచ్చారు. కొద్ది సేపు పార్టీ ఆఫీస్ లో ఉంచిన తరువాత, కోడెల పార్థివదేహాన్ని నరసరావుపేటలోని ఆయన నివాసానికి తీసుకు వచ్చారు. ఈ రోజు సాయంత్రం, 3 గంటలకు ఆయన అంత్యక్రియలు జరిగే అవకాసం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read