ఈ రోజుల్లో, సహజంగా రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నేతలు ఎక్కడ దొరుకుతారా అని చూస్తూ ఉంటారు. ఏదైనా చిన్న సంఘటన జరిగినా, వారిని ట్రాప్ చేసి, అల్లరి అల్లరి చేసి, వారిని రాజకీయంగా దెబ్బ వేసి, తీవ్రంగా వేధిస్తారు. ఇందుకు ఉదాహరణే కోడెల ఉదంతం. ఒక చిన్న ఫర్నిచర్ కేసు, అదీ కోడెల అధికారంలో ఉండగా, తనకు హక్కుగా వచ్చింది వాడుకున్నారు. అధికారం దిగిపోగానే, రెండు ఉత్తారాలు రాసారు. దాన్ని ఇప్పటి స్పీకర్ కార్యాలయం అక్నాలేడ్జ్ కూడా చేసింది. అయినా తరువాత ఆయన పై కేసు పెట్టారు. కోడెల కోరినట్టు ఫర్నిచర్ తీసుకు వెళ్ళకుండా, ఆయన పై ఎదురు కేసు పెట్టారు. సహజంగా ఇలాంటివి, ఏ రాజకీయ నాయకుడు దగ్గర నుంచి అయినా రికవర్ చేసుకుంటారు, లేకపోతే డబ్బులు కట్టించుకుంటారు. కాని, ఇక్కడ అది ఏమి చెయ్యకుండా, దొంగ దొంగ అంటూ కేసులు పెట్టి అవమానించారు.

kodela vs 18092019 2

అయితే ఈ సందర్భంలోనే, కోడెల, వైసీపీ నేతల మధ్య ఇది వరకు జరిగిన సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా విజయసాయి రెడ్డి, కోడెల మధ్య జరిగిన సంఘటన. కోడెల స్పీకర్ గా ఉండగా, వైసిపీ నేతలకు కావాల్సిన పనులు చేసి పెట్టారు. కాని కోడెల ను టార్గెట్ చేస్తున్న సమయంలో ఒక్కరు కూడా మాట్లాడలేదు. వ్యతిగత ఇమేజ్ దెబ్బ తీస్తున్నారని, ఇది మంచిది కాదని, వారికి వర్తమానం పంపినా, వారి నుంచి సమాధానం లేదు. ఇక విజయసాయి రెడ్డి విషయానికి వస్తే, ఆ రోజు కోడెల కనుక చూసి చూడనట్టు వెళ్ళకపోయి ఉంటే, ఈ రోజు విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యే వారు కాదు. ఇదే విషయం స్వయంగా కోడెల చెప్పారంటూ, ఈ రోజు పత్రికల్లో వార్తలు వచ్చాయి. కోడెల అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న సమయంలోనే, విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ వేసారు.

kodela vs 18092019 3

రిటర్నింగ్‌ అధికారిగా అసెంబ్లీ అధికారి ఉన్నారు. ఈ సమయంలో, విజయసాయి రెడ్డి నామినేషన్ లో తప్పులు ఉన్నాయని, ఆయన్ను నామినేషన్ తిరస్కరించాలని, ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విజయసాయి వెంటనే రంగంలోకి దిగి, కోడెలతో మాట్లాడి, అవి చిన్న చిన్న తప్పులు అని, వాటి కోసం నామినేషన్ తిరస్కరించవద్దు అని కోరారు. దీంతో కోడెల రంగంలో దిగి, రిటర్నింగ్‌ అధికారిగా ఉన్న అసెంబ్లీ అధికారితో మాట్లాడి, చిన్న చిన్న ఫిర్యాదులు ఆధారంగా నామినేషన్‌ తిరస్కరించడం సరికాదని, రాజకీయంగా మేము మేము చూసుకుంటాం అని, విజయసాయి నామినేషన్‌ ఒకే అయ్యేలా చూసారు కోడెల. అయితే ఇప్పుడు ప్రభుత్వం వేధిస్తున్న విధానం చూసి, ఇలా చెయ్యటం మంచిది కాదని, కోడెల తనకు తెలిసినవారితో విజయసాయిరెడ్డితో మాట్లాడించారు. అయితే అప్పటి నుంచి, విజయసాయి ట్విట్టర్ లో ఇంకా హీనంగా కోడెల పై రాతలు రాయటం మొదలు పెట్టటంతో, కోడెల నివ్వెరపరపోయారు. వైసీపీ ప్రత్యర్ధులను వేటాడి వెంటాడు తుంటే, తెలుగుదేశం మాత్రం అధికారంలో ఉండగా, జాలి గుండెలతో వైసీపీ నేతలకు సహాయం చేసారు. రెండు పార్టీల రాజకీయానికి ఇదే తేడా.

Advertisements

Advertisements

Latest Articles

Most Read