ఈ రోజు ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో, జగన్ మోహన్ రెడ్డి పాల్గున్నారు. అయితే ఈ కార్యక్రమం చివరలో, అనుకోని సంఘటనతో, అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ముఖ్యంగా జగన్ భద్రతా సిబ్బంది, ఊహించని సంఘటన చూసి షాక్ అయ్యారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న సెక్యూరిటీ వేడుకల్లో, సెక్యూరిటీని దాటుకుని, జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు దూసుకెళ్ళారు చంద్రబాబు వీరాభిమాని. అయితే ఇది రాజకీయంగా ఎదో హాని చెయ్యటానికి మాత్రం కాదు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఇచ్చిన మాట నెరవేర్చాలని చెప్పటానికి. దీని పై జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. ఇక విషయానికి వస్తే, విజయవాడకు చెందిన కోలా దుర్గారావు అనే వ్యక్తికి రెండు చేతులు లేవు.

kola 15082019 2

చిన్నప్పుడు ఎలెక్ట్రిక్ షాక్ తో, రెండు చేతులు పోయాయి. అయితే గతంలో చంద్రబాబు సియంగా ఉండగా, అతన్ని అన్ని విధాలుగా ఆదుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఉండగా, అమెరికా నుంచి సెన్సార్లతో పనిచేసే కృత్రిమ చేతులు తెప్పించి ఇచ్చారు. అదే విధంగా, దుర్గారావుకు ఉద్యోగం కూడా ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మేరకు, ముందుకు వెళ్తున్న వేళ, ఎన్నికలు రావటం, ఎన్నికల కోడ్ రావటంతో, ఆ హామీని చంద్రబాబు నెరవేర్చలేకపోయారు. ఇదే విషయాన్ని ఈ రోజు అతి కష్టం మీద జగన్ ను కలిసి, దుర్గారావు చెప్పారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు , తనకు ఇచ్చిన హామీని ఇప్పుడు అధికారంలో ఉన్న మీరే తీర్చాలని అతను జగన్ కు కోరారు. తనకు రెండు చేతులు లేవని, ఆదుకోవాలని కోరారు. అయితే ఈ విషయం పై దృష్టి పెట్టాలని సంబంధిత అధికారికి జగన్ ఆదేశాలు జారీ చేశారు.

kola 15082019 3

దుర్గారావు నేపధ్యం చూస్తే, అతను విజయవాడలోని రాజరాజేశ్వరీపేట వాస్తవ్యుడు. అయితే చిన్నప్పుడే ఊహించని రీతిలో తన రెండు చేతులను కోల్పోయాడు. చిన్న వయసులో గాలిపటం కోసం కరెంట్ స్తంభం ఎక్కి ప్రమాదానికి గురయ్యాడు. కరెంట్ తీగలపై పడటంతో, రెండు చేతులు తెగిపోయాయి. అయితే రాను రాను క్రీడల్లో బాగా రానిస్తూ మంచి పేరు సంపాదించాడు. అయితే సంఘటన జరిగిన తరువాత, చంద్రబాబుకు విషయం తెలియటంతో, పదేళ్ళ క్రితమే అతనికి చంద్రబాబు సహాయం చేసారు. తరువాత చంద్రబాబు 2014లో అధికారంలోకి రావటంతో, 2018 సమయంలో దుర్గారావు చంద్రబాబుని వచ్చి కలిసి, డిగ్రీ చదివాను అని, క్రీడల్లో బాగా రానిస్తున్నాని, తన జీవినం సాగించాటానికి ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని కోరగా, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చే అవకాశాలు చూడాలని చంద్రబాబు ఆదేశించారు. అయితే ఎన్నికల కోడ్ రావటం, ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, చంద్రబాబు ఇచ్చిన హామీని, మీరు నెరవేర్చాలని జగన్ ను కోరారు. మరి జగన్ గారు, ఎదో చూడమనటం కాకుండా, నిజంగా అతనికి ఉద్యోగం ఇవ్వాలని ఆశిద్దాం.

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read