పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (దీదీ) ఆధ్వర్యంలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు ఉద్దేశించి శనివారం రోజున ‘యునైటెడ్ ఇండియా ర్యాలీ’ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీకి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు, ముఖ్యనేతలు హాజరై ర్యాలీని విజయవంతం చేశారు. మరీముఖ్యంగా ముందుగా అనుకున్నదానికంటే భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలిరావడం గమనార్హం. ర్యాలీ అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రముఖులు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీని టార్గెట్ చేస్తూ దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో సభ ముగిసిన అనంతరం.. ప్రభుత్వ అతిథి గృహంలో వివిధ పార్టీల నేతలకు సీఎం మమతా బెనర్జీ తేనీటి విందు ఇచ్చారు.

kolkata 20012019 2

ఈ విందుకు అంతా తానై స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబే పర్యవేక్షించడం విశేషం. ఇక్కడ నేతలందరూ కలిసి తదుపరి వ్యూహం కోసం చర్చించారు. మోడీ, అమిత్ షా చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎలా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, తదుపరి అడుగులు ఏమిటి అనేదాని పై చర్చలు జరిపారు. భారీ ర్యాలీలో, బహిరంగ సభలో.. చంద్రబాబు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇదిలా ఉంటే వక్తలు తమ ప్రసంగాల్లో చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించడం ఆయన దక్కిన గౌరవమనే చెప్పుకోవచ్చు. భిన్న పార్టీలను ఏకం కావడంతో చంద్రబాబు భూమికను నేతలు అభినందించారు.

kolkata 20012019 3

సభలో బాబు స్పీచ్ హైలైట్స్..! రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. కర్ణాటకలోనూ ఎన్నికైన ప్రభుత్వాన్ని కుప్పగూల్చే ప్రయత్నాలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బాబు ఈ సందర్భంగా హెచ్చరించారు. కర్ణాటకలో ఎమ్మెల్యేలను జంతువుల్లా కొనుగోలు చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని, విభజన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. సీబీఐ, ఆర్బీఐ, న్యాయవ్యవస్థ నుంచి ప్రతి వ్యవస్థను కేంద్రం నీరుగారుస్తోందన్నారు. 2019లో కొత్త ప్రభుత్వాన్ని చూడబోతున్నామని జోస్యం చెప్పారు. మోదీ, అమిత్‌షాలను కోరుకుంటున్నారా? మార్పు కోరుకుంటున్నారా? అని ప్రజలను బాబు ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ విక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం ప్రశంసనీయమని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read