కొండపల్లి అక్రమ మైనింగ్ అంశంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు - కాలువను పూడ్చినవాళ్లు.. అటవీ భూమిని ఆక్రమించలేదా? - కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమ మైనింగ్‍పై రాష్ట్ర ప్రభుత్వ వ్యాఖ్యలను జీర్ణించుకోవడం కష్టంగా ఉందంటూ ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు - పంటకాల్వను పూడ్చేసి రహదారి, స్టోన్ క్రషర్ నిర్మించి కొండపల్లి అటవీ భూమిలో అక్రమ మైనింగ్‍కు పాల్పడలేదనడం నమ్మశక్యంగా లేదన్న హైకోర్టు - పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు - పీసీబీ, అటవీశాఖ, కృష్ణా జిల్లా కలెక్టర్, జలవనరులు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 మందికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు - హైకోర్టులో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి పిల్ - పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన ఎన్వీ సుమంత్ - తదుపరి విచారణ ఐదు వారాలకు వాయిదా

Advertisements

Advertisements

Latest Articles

Most Read