వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ఎన్నికల్లో దౌర్జన్యాలు చేసి గెలిచిందో అందరం చూసాం. చివరకు కుప్పంలో కూడా, తమ దౌర్జన్యాలు కొనసాగించారు. నామినేషన్ వేసే ఆలోచన దగ్గర నుంచి, ఫలితాలు ప్రకటించే వరకు, వీళ్ళు ప్రతి అడుగులో చేయని అరాచకం అంటూ ఏమి లేదు. అరాచకం అనేది చిన్న పదం అని చెప్పాలి. ముఖ్యంగా కుప్పంలో దొంగ ఓట్ల దండయాత్ర చేసారు. ఇది ఇలా ఉంటే, కొండపల్లి మునిసిపాలిటిలో, ఎప్పుడూ తెలుగుదేశం గెలవలేదు కాబట్టి, ఇక్కడ ఎలాగూ తమకే వేస్తారు అనే కాన్ఫిడెన్సు తో, ఇక్కడ పట్టించుకో లేదు. దీంతో ఇక్కడ అసలైన ప్రజా తీర్పు వచ్చింది. అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ కొండపల్లిలో గెలిచింది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ మునిసిపాలిటిని ఎప్పుడూ గెలుచుకోలేదు. దీంతో వైసీపీ షాక్ తింది. ఇక్కడ ఎలా అయినా గెలవాలని, అడ్డ దారులు తొక్కటానికి ప్రయత్నాలు చేసింది. అయితే దేవినేని ఉమా, కేశినేని నాని నిలబడి, వైసీపీకి ఎదురు నిలిచారు. చివరకు కోర్టులకు కూడా వెళ్ళారు. ఎంత ప్రయత్నాలు చేసినా, టిడిపి వారిని లొంగ దీసుకోలేక పోయారు. చివరకు కోర్టు జోక్యంతో ఎన్నిక జరగగా, తెలుగుదేశం పార్టీ కొండపల్లి ఖిల్లా పై జెండా ఎగురవేసింది. దీంతో వైసీపీకి పరాభవం తప్పలేదు.

kondapalli 27112021 2

స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు షాక్ తగిలింది. జగన్ దగ్గర ఇబ్బందులు ఎదురు అయ్యాయి. అసలకే కష్టాల్లో ఉన్న వైసీపీకి కొండపల్లిలో మరో షాక్ తగిలింది. వైసీపీ సీనియర్ నేత, మైలవరం మండల కార్యదర్శి యర్రగోపుల రాంబాబు పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు రాజీనామా లేఖ పంపారు. కేవలం వసంత కృష్ణప్రసాద్ వైఖరి వల్లే పార్టీని వదిలేస్తున్నా అని లేఖలో తెలిపారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా గుర్తింపు లేకుండా చేసారని అన్నారు. పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి, పార్టీలో ఉన్నానని, జగన్ వెంట నిలబడ్డా అని అన్నారు. పార్టీ ఇక్కడ స్థానికంగా బలపడటంలో, కష్టపడ్డానని తెలిపారు. ఇది వరకు జోగి రమేష్ నేతృత్వంలో కూడా పని చేసాం అని అన్నారు. వసంత గెలుపుకి ఎలా కృషి చేసింది లేఖలో వివరించారు. పార్టీ ప్రతి కార్యక్రమానికి వెన్నంట ఉన్న నాకు, ఈ పార్టీలో కనీసం గుర్తింపు లేదు కాబట్టి, రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఇతను బలమైన నేత కావటంతో, వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టు అయ్యింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read