గత ఏడాది కాలంగా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పని తీరు పై, సీనియర్ నటుడు కోటా శ్రీనివాస రావు, సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా, కొన్ని టీవీ చానల్స్ కు కోటా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అనేక విషయాల పై మాట్లాడిన కోటా, రాజకీయాల పై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. గతంలో తాను బీజేపీ ఎమ్మెల్యేగా చేసిన విషయాలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా, జగన్ పరిపాలన గురించి అడగగా, నేను జగన్ పరిపాలన గురించి ఒకే ఒక మాట చెప్తాను, నన్ను అంతకు మించి అడగవద్దు అంటూ, జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. నిద్రపోయే వాడిని లేపొచ్చు కాని, నటించే వాడిని లేపలేం కదా, అన్నీ ఆయనకు తెలిసే జరుగుతున్నాయి అంటూ, తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. కోటా ఏమన్నారు అంటే, "ఇప్పుడు నేను తెలంగాణా గురించి పెద్దగా మాట్లాడు కాని అండి, నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతాను. నాకు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే అర్హత ఉంది. ఎందుకంటే, నేను అక్కడ ఎమ్మెల్యేగా చేసాను కాబట్టి, రెండోది నేను విజయవాడ పక్కనే ఉన్న కంకిపాడు నా సొంత ఊరు, అక్కడ నాకు ఆస్తి అది ఉంది, విజయవాడలో ఉంది."

"కాబట్టి నేను ఆంధ్రా రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఉందని అనుకుంటున్నా. నేను ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి గురించి ఒకే ఒక మాటలో చెప్తాను. ఎక్కువ మాట్లాడను, మీరు నన్ను ఇంకా అడిగి ఇబ్బంది పెట్టవద్దు. నేను పాత సామెతలు బాగా నమ్ముతాను, మనకు అవి కరెక్ట్ గా సరిపోతాయి. ఆ సామెత ప్రకారం ఇప్పుడు ఆంధ్రాలో ఎలా ఉంది అంటే, మనం నిద్రపోయే వాడిని లేపొచ్చు, నిద్ర నటించే వాడిని లేపాలెం కదా. అక్కడ జరుగుతుంది కూడా అంతే. అక్కడ జరిగేవి అన్నీ జగన్ మోహన్ రెడ్డి గారికి తెలియక జరుగుతున్నాయా ? మరి ఎందు వల్ల అలా జరుగుతుందో ? అంతకు మించి నేను ఏమి చెప్పలేను. అందుకే ఒకే ఒక మాట చెప్తున్నా, నిద్ర పోయే వాడిని లేపొచ్చు, నిద్ర నటించే వాడిని లేపలేం" అంటూ కోటా చెప్పుకొచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read