కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఈనెల 28న తెదేపాలో చేరనున్నారు. కోడుమూరు సభలో తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇందుకోసం కోడుమూరులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం సమీపంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే మైదానంలో గతేడాది నవంబరు 11న కాంగ్రెస్‌ పార్టీ ‘రైతు మహాసభ’ జరిగింది. దానికన్నా భారీగా లక్ష మంది కార్యకర్తలతో ఈ సభ నిర్వహించడానికి కసరత్తు జరుగుతోంది. తదనుగుణంగా కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో జనసేకరణ చేస్తున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో సూర్యప్రకాశ్‌రెడ్డి ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు.

kodumuru 21022019

మరో రెండు రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఆయన రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా తెదేపా తరఫున బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఆలూరు, డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గాలూ తమకు కేటాయించాలని కోట్ల కుటుంబం ప్రతిపాదించింది. మరోవంక ఉప ముఖ్యమంత్రి కేఈ కుటుంబం సీఎంతో భేటీ అయినప్పుడు పత్తికొండ, డోన్‌ తమకే కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ డోన్‌ కేఈ కుటుంబానికే ఇస్తే ఆలూరు నుంచి కోట్ల సుజాతమ్మ పోటీ చేస్తారు. కోట్ల కుమారుడు రాఘవేంద్రరెడ్డికి ఏదైనా పదవి కేటాయించే అవకాశం ఉండనుంది. మరోవైపు ఉపముఖ్యమంత్రి కేఈ కుటుంబం కూడా డోన్‌ను కోరుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. దీంతో పాటు కర్నూలు జిల్లాలోని వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు ఎల్‌ఎల్‌సీ కాలువకి పైపులైన్‌ వేయాలనే డిమాండ్లను సీఎం చంద్రబాబు దృష్టికి కోట్ల తీసుకెళ్లారు.

kodumuru 21022019

ఇప్పటికే వేదవతికి నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. ఎల్‌ఎల్‌సీ పైపు లైన్‌, గుండ్రేవుల ప్రాజెక్టుల శంకుస్థాపనకు సీఎం హామీ ఇచ్చినట్లు కోట్ల అనుచరులు చెబుతున్నారు. తెదేపాలో చేరికపై కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తన అనుచరులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఇది ఇలా ఉంటే, కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, మరో రెండు మూడు రోజుల్లో చంద్రబాబుతో భేటీ కానున్నారు. మైదుకూరు టికెట్‌ ఇవ్వాలని మాజీ మంత్రి డీఎల్ కోరుతున్నారు. టీడీపీ అధిష్టానం కూడా మైదుకూరు టికెట్‌ డీఎల్‌కు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అయితే.. మైదుకూరు టికెట్ తనకే ఇవ్వాలని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పట్టుబడుతున్నారు. డీఎల్, చంద్రబాబు భేటీ అనంతరం మైదుకూరు టికెట్ విషయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. టికెట్ ఖాయమైతే డీఎల్ టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్టుగా భావించవచ్చు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read